తెలుగు రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ఇప్పటికే 7 సీజన్లు పూర్తిచేసుకుని ఎనిమిదవ సీజన్ లోకి అడుగు పెట్టింది. ఏడవ సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగి మంచి హిట్ అయిందని చెప్పవచ్చు. అదే ఊపుతో సీజన్ 8 కూడా ప్రారంభానికి సిద్ధం అయిపోతుంది. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ అనేది టిఆర్పి రేటింగ్ లో మంచి స్థానంలో కొనసాగుతూ వస్తోంది. సీజన్ 8లో ఈ రేటింగ్ మరింత పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది బిగ్ బాస్ యాజమాన్యం. బిగ్బాస్ తెలుగులో ప్రారంభమైన మొదట్లో ఎన్టీఆర్ హోస్టుగా చేశారు. ఆ తర్వాత రెండవ సీజన్ వచ్చేసరికి నాని హోష్టిగా చేశారు.
న్యూస్ లైన్ డెస్క్:తెలుగు రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ఇప్పటికే 7 సీజన్లు పూర్తిచేసుకుని ఎనిమిదవ సీజన్ లోకి అడుగు పెట్టింది. ఏడవ సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగి మంచి హిట్ అయిందని చెప్పవచ్చు. అదే ఊపుతో సీజన్ 8 కూడా ప్రారంభానికి సిద్ధం అయిపోతుంది. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ అనేది టిఆర్పి రేటింగ్ లో మంచి స్థానంలో కొనసాగుతూ వస్తోంది. సీజన్ 8లో ఈ రేటింగ్ మరింత పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది బిగ్ బాస్ యాజమాన్యం. బిగ్బాస్ తెలుగులో ప్రారంభమైన మొదట్లో ఎన్టీఆర్ హోస్టుగా చేశారు. ఆ తర్వాత రెండవ సీజన్ వచ్చేసరికి నాని హోష్టిగా చేశారు.
మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్టుగా చేస్తూ వస్తున్నారు. నాగార్జున అయితేనే ఈ షో అద్భుతంగా ముందుకు సాగగలరని అర్థం చేసుకోవచ్చు. ఆయన మాట తీరు, తికమక పెట్టే టాస్కులు, ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు అందరిని ఓ రేంజ్ కు తీసుకెళ్లడంలో నాగార్జున ప్రముఖ పాత్ర పోషిస్తారు. అలా సీజన్ సెవెన్ కూడా రక్తి కట్టేలా చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు నాగార్జున. ఇదే తరుణంలో సీజన్ 8 కూడా అద్భుతమైన కంటెస్టెంట్లతో ప్రారంభం అవ్వబోతుందని తెలుస్తోంది.
ఇందులో కూడా నాగార్జున హోస్ట్ గా వస్తారట. అయితే సీజన్ 8 లో కూడా కొంతమంది ఇండస్ట్రీలో ఉండేటువంటి నటీనటులు ఫేమస్ యూట్యూబర్లు, పబ్లిక్ పర్సనాలిటీలు, కామన్ వ్యక్తులు, రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు రాబోతున్నారని ప్రచారం సాగుతోంది.
ముఖ్యంగా అందరూ ఊహించిన విధంగా సీజన్ 8 లో యాంకర్ రీతు చౌదరి, అలాగే సురేఖ వాణి, లేదంటే ఆమె కుమార్తె సుప్రీత, కుమారి ఆంటీ, బర్రెలక్క, కిరాక్ ఆర్పి, బుల్లెట్ భాస్కర్, కుషిత కళ్ళకు, అమృత ప్రాణ, చమ్మక్ చంద్ర, వేణు స్వామి, ఫేమస్ అయినటువంటి పేర్లు వినిపిస్తున్నాయి. తుది జాబితా ఏంటనేది ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం ఎనిమిదవ సీజన్ కోసం ప్రజలంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 8వ తేదీన గ్రాండ్ ప్రీమియర్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి వీళ్లే కాకుండా ఇంకెవరైనా వస్తారా అనేది సెప్టెంబర్ 8వ తేదీన గ్రాండ్ ఫ్రీమియర్ ప్రారంభంలో తెలుస్తుంది.