Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి కన్ఫర్మ్ అయిన పేర్లు ..లిస్ట్ లో లవర్ బాయ్ కూడా !

నయన పావని, విష్ణు ప్రియా పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లతో పాటు యాక్టర్ అబ్బాస్ కూడా ఈ సారి ఆటలో ఉంటారట.


Published Jul 26, 2024 12:50:29 PM
postImages/2024-07-26/1722016215_biggboss8telugu.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ ..బిగ్ బాస్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ హడావిడే. కంటెస్టెంట్స్ ఎక్కడున్నారో కాని ...జనాలకి మాత్రం ఉత్సాహాం ఆగడం లేదు. ఎవరు బాగుంటారు...ఎవరు ఎక్కువ స్కిన్ షో చేస్తారు. కామెడీ లైన్ ఎవరు బాగా చేస్తారో ఎన్నో ఊహాగానాల మధ్య కొంతమంది పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీళ్లతో పాటు టాలీవుడ్ లో అందగాడు లవర్ బాయ్ ఇమేజ్ తో ఉన్న టాప్ హీరో కూడా ఈ సారి ఆటలో ఉంటాడంటున్నారు.


అయితే ఈసారి హౌస్ లోకి వెళ్లే వారిలో చాలా వరకు మనకు తెలిసిన మొఖాలే ఉంటాయంటున్నారు.   ఇంతకీ ఎవరంటే ...కిర్రాక్ ఆర్పీ, అమృతా ప్రణయ్, నిఖిల్ , కుమారీ ఆంటీ, బర్రెలక్క, అనీల్ గీలా, బుల్లెట్ భాస్కర్, బమ్ చిక్ బబ్లూ, వంశీ లతో పాటు రీతూ చౌదరి, సోనియా సింగ్, కుషితా కల్లపు, సుప్రిత, అంజలి పవన్, వింధ్య విశాక, వర్షిణి , నయన పావని, విష్ణు ప్రియా పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లతో పాటు యాక్టర్ అబ్బాస్ కూడా ఈ సారి ఆటలో ఉంటారట.


సోషల్ మీడియాలో ఈ  వార్త భలే చక్కర్లు కొట్టేస్తున్నాయి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న అబ్బాస్. సింగపూర్ లో సెటిల్ అయ్యారు. ఇటీవలే ఆయన చెన్నైకు వచ్చారు. మరి నిజంగా అబ్బాస్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతాడా అనేది చూడాలి. కాని ఇండస్ట్రీ గాలి అంతా అవుననే చెబుతున్నాయి చూద్దాం మరి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news socialmedia big-boos8

Related Articles