స్టార్ మాలో వచ్చేటువంటి అన్ని ప్రోగ్రామ్స్ లో అద్భుతమైన ఆదరణ పొందినటువంటి రియాలిటీ షో బిగ్ బాస్. అలాంటి బిగ్ బాస్ కోసం ప్రతి ఏడాది ఎంతో మంది అభిమానులు వేచి చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ స్టార్ట్ అయిన మొదట్లో ఎన్టీఆర్ హోస్టుగా చేసి అదరగొట్టేసారు. ఆ తర్వాత సెకండ్ సీజన్ లో నాని హోస్టుగా చేశారు. అప్పటివరకు పెద్దగా ఆదరణ పొందని, బిగ్ బాస్ నాగార్జున ఎప్పుడైతే హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చారో, అప్పటినుంచి వరుసగా ఐదవ సీజన్ వరకు మంచి రేటింగ్ తో దూసుకెళ్లింది.
న్యూస్ లైన్ డెస్క్: స్టార్ మాలో వచ్చేటువంటి అన్ని ప్రోగ్రామ్స్ లో అద్భుతమైన ఆదరణ పొందినటువంటి రియాలిటీ షో బిగ్ బాస్. అలాంటి బిగ్ బాస్ కోసం ప్రతి ఏడాది ఎంతో మంది అభిమానులు వేచి చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ స్టార్ట్ అయిన మొదట్లో ఎన్టీఆర్ హోస్టుగా చేసి అదరగొట్టేసారు. ఆ తర్వాత సెకండ్ సీజన్ లో నాని హోస్టుగా చేశారు. అప్పటివరకు పెద్దగా ఆదరణ పొందని, బిగ్ బాస్ నాగార్జున ఎప్పుడైతే హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చారో, అప్పటినుంచి వరుసగా ఐదవ సీజన్ వరకు మంచి రేటింగ్ తో దూసుకెళ్లింది.
ఆరో సీజన్ లో కాస్త డల్ అయిపోయింది. కానీ ఏడవ సీజన్ వచ్చేసరికి రేటింగ్ అనేది ఆకాశాన్ని అంటిందని చెప్పవచ్చు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో నాగార్జున అంతకుముందు సీజన్ లా కాకుండా ఉల్టా పల్టాగా టాస్కులు ఇచ్చారు. దీంతో ఏడవ సీజన్ మొత్తం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. చివరికి ఏడవ సీజన్ లో సామాన్య రైతుబిడ్డగా వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ విన్నరయ్యారు. అలాంటి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసిన తర్వాత సీజన్ 8 గురించే అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
సీజన్ 8లో సీజన్ సెవెన్ కు మించి కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారట. ఈసారి అన్ని రంగాల నుంచి అద్భుతంగా ఫేమస్ అయినవారిని తీసుకువస్తున్నారని తెలుస్తోంది. తాజాగా మన కందిన సమాచారం ప్రకారం సీజన్ 8, సెప్టెంబర్ నెలలో ప్రారంభం అవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే బిగ్బాస్ ఎయిట్ సీజన్ లో జాతకాల ద్వారా ఫేమస్ అయిన వేణు స్వామి కూడా వస్తున్నారని తెలుస్తోంది.
ఈయనతో పాటు జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి, కర్ణ శిరీష, సోనియా సింగ్ అలాగే కుషిత కళ్ళకు, అలాగే ఫుడ్ బిజినెస్ లో ఎంతో ఫేమస్ అయిన కుమారి ఆంటీ లాంటివారు పాల్గొననున్నారని తెలుస్తోంది. ఇక సామాన్య కంటెస్టెంట్లలో కుమారి ఆంటీని తీసుకుంటున్నారు. ఈమె కూడా పల్లవి ప్రశాంత్ లా అదరగొడుతుందా.? లేదంటే ఫ్లాప్ అవుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.