Google Job: మిడిల్ క్లాస్ గ్రాడ్యుయేట్‌కి రూ.2 కోట్ల ప్యాకేజీ..గూగుల్ లో ఉద్యోగం !

బీహార్‌లోని జముయి జిల్లాలోని జము ఖరియా అనే మారుమూల గ్రామానికి చెందిన కంప్యూటర్ ఇంజనీర్ అయిన అభిషేక్ కుమార్ పాట్నాలోని ఎన్‌ఐటీలో బీటెక్‌ చేశాడు


Published Sep 20, 2024 01:34:00 PM
postImages/2024-09-20/1726819516_Screenshot20240920133150.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బీహార్ యువకుడు అభిషేక్ కుమార్ కు గూగుల్ లండన్ లో జాబ్ కొట్టాడు. 2 కోట్ల రూపాయిల ప్యాకేజీతో జాబ్ సాధించాడు. అక్టోబర్ లో జాయినింగ్ ఉంటుంది. ఇది తన అతి పెద్ద విజయమని తెలిపారు. బీహార్‌లోని జముయి జిల్లాలోని జము ఖరియా అనే మారుమూల గ్రామానికి చెందిన కంప్యూటర్ ఇంజనీర్ అయిన అభిషేక్ కుమార్ పాట్నాలోని ఎన్‌ఐటీలో బీటెక్‌ చేశాడు. 


అభిషేక్ తండ్రి ఇంద్రదేవ్ యాదవ్ జాముయి సివిల్ కోర్టులో న్యాయవాది కాగా, అతని తల్లి మంజు దేవి గృహిణి. మొదటి నుంచే అభిషేక్ చదువులో ఫస్ట్ ఉండేవాడు. గూగుల్ లో జాబ్ కొట్టడం తన డ్రీమ్ . కాని ఇంత త్వరగా టార్గెట్ ను రీచ్ అవ్వగలనుకోలేదంటున్నాడు అభిషేక్.


జముయిలో పాఠశాల విద్యను పూర్తి చేసిన అభిషేక్‌, NIT పాట్నా నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని పొందాడు. 2022లో Amazonలో రూ.1.08 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాన్ని పొందాడు. ఇక్కడి నుంచే అతని కెరీర్ ప్రారంభమైంది. అక్కడ మార్చి 2023 వరకు పనిచేశాడు.  ఆ తర్వాత గూగుల్ లో జాబ్ కొట్టాడు. ఓ వైపు 8-9 గంటల ఉద్యోగం చేస్తూ గూగుల్ ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు.


‘మట్టితో కట్టిన ఇంటిలో ఉన్ననేను ఇప్పుడు కొత్త ఇంటిని కట్టుకుంటున్నాను. తల్లి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఉద్యోగంలో చేరిన తర్వాత ఆమెకు మంచి వైద్యం అందిస్తాను’ అంటూ అభిషేక్‌ ఆనందం వ్యక్తం చేశాడు. తండ్రి సివిల్ కోర్టులో న్యాయవాదే అయినా ..ఆర్ధికంగా అంత ఉన్నత కుటుంబం కాదు..కనీసం నా విజయం నా తల్లితండ్రులకు ఉపయోగపడుతుంది హ్యాపీ అంటున్నారు అభిషేక్.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bihar jobs google-voice interview

Related Articles