సరదాగా ఆ వీడియో చేశానని, కానీ కావాలనే కొందరు వివాదాస్పదం చేస్తున్నారని వెల్లడించారు. ఏదో అక్షరదోషం కారణంగా మాత్రమే పొరపాటు జరిగిందని తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: భగవద్గీతను అనుకరిస్తూ.. ఇటీవల బిత్తిరి సత్తి విడుదల చేసిన వీడియో ఒకటి వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. దీంతో భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశారంటూ బిత్తిరి సత్తిపై తెలంగాణ 'వానర సేన' సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే బిత్తిరి సత్తికి ఫోన్ చేసి హిందూ సమాజాన్ని అవమానించేలా వీడియో చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే క్రైమ్ పోలీసులకు వానర సైన్యం సభ్యులు ఫిర్యాదు చేశారు. బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో బిత్తిరి సత్తి తీవ్ర వివాదాస్పదం అయ్యారు. తాజాగా, ఈ అంశంపై ఆయన స్పందించారు. భగవద్గీతపై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు.
సరదాగా ఆ వీడియో చేశానని, కానీ కావాలనే కొందరు వివాదాస్పదం చేస్తున్నారని వెల్లడించారు. ఏదో అక్షరదోషం కారణంగా మాత్రమే పొరపాటు జరిగిందని తెలిపారు. ఆ మాటలు ఎవర్నీ కించపరచాలనే ఉద్దేశంతో అనలేదని వెల్లడించారు. ఎవరైనా బాధపడితే అందుకు క్షమాపణ చెబుతున్నానని సత్తి స్పష్టం చేశారు.
ఐ యామ్ వెరీ సారీ..
భగవద్గీత వివాదంపై బిత్తిరి సత్తి సంచలన వీడియో pic.twitter.com/BoYKeKqdIA — News Line Telugu (@NewsLineTelugu) August 8, 2024