Trisha: త్రిష ప్రధాన పాత్రగా 'బృంద' .. క్రైమ్ థ్రిల్లర్ టీజర్ రిలీజ్ !

త్రిష రోజు రోజుకు మరీ ముద్దుగా తయారవుతుంది. ఈ మధ్య ఫ్యాన్స్ కూడా ఇదే ఫీలవుతున్నారు. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇంత బిజీలోను ఆమె వెబ్ సిరీస్ లపై తన ఫోకస్ తగ్గించలేదు. తను లీడ్ రోల్ చేస్తున్న " బృంద'  సోనీ లివ్ లో ఆగష్టు 2 న స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది.


Published Jul 09, 2024 02:19:00 PM
postImages/2024-07-09/1720515100_TrishasdebutwebseriesasapoliceofficerafterthesuccessofPonniyinSelvanheresthelatestbigupdate1669118343.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: త్రిష రోజు రోజుకు మరీ ముద్దుగా తయారవుతుంది. ఈ మధ్య ఫ్యాన్స్ కూడా ఇదే ఫీలవుతున్నారు. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇంత బిజీలోను ఆమె వెబ్ సిరీస్ లపై తన ఫోకస్ తగ్గించలేదు. తను లీడ్ రోల్ చేస్తున్న " బృంద'  సోనీ లివ్ లో ఆగష్టు 2 న స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది.


ఈ సిరీస్ రచయిత, దర్శకుడు సూర్య మనోజ్‌ వంగాల గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు  'బృంద' చాలా మంచి థ్రిల్లర్ . శక్తిమంతమైన ఫీమేల్‌ లీడ్‌ నెరేటివ్‌ స్టోరీతో ఈ సిరీస్‌ని డైరక్ట్ చేయడం ఆనందంగా ఉంది.  థ్రిల్లర్ లో కూడా ఓ మంచి థ్రిల్లర్. మీరు ఇప్పటి వరకు చూసినట్లు ఉండదని అన్నారు మనోజ్.


సూర్య మనోజ్‌ వంగాలా, పద్మావతి మల్లాది కలిసి రూపొందించిన స్క్రీన్‌ప్లే ఈ సిరీస్‌కి హైలైట్‌ కానుందట. శక్తికాంత్‌ కార్తిక్‌ సంగీతం అందించారు. ఇంద్రజిత్‌ సుకుమారన్‌, జయప్రకాష్‌, ఆమని, రవీంద్ర విజయ్‌, ఆనంద్‌ సామి, రాకేందు మౌళి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే త్రిష ను సోనీ లో చూడాలంటే మాత్రం ఆగష్టు 2 వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news trisha

Related Articles