Vinod Kumar: పదవి కోసం కాదు తెలంగాణ హక్కుల కోసం కొట్లాడండి

ఎనిమిది మంది బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది నిమిషాలు మాట్లాడలేదని, ఎనిమిది కొత్తలు తీసుకురాలేదని బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


Published Jul 26, 2024 09:57:55 AM
postImages/2024-07-26/1722000544_vinod2233.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఎనిమిది మంది బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది నిమిషాలు మాట్లాడలేదని, ఎనిమిది కొత్తలు తీసుకురాలేదని బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి పదవి పోయినా పర్వాలేదు తెలంగాణ హక్కుల కోసం కొట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ ఖాజీపేటలో రైల్వే కోచ్ ప్యాక్టరీ కోసం నిరసన తెలుపుతున్న వారికి ఆయన సంఘీభావం తెలిపారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 మంది, కాంగ్రెస్‌కు 8 మంది ఎంపీలను గెలిపించారు. ఇప్పుడు పదహారు మంది ఏం చేస్తున్నారని నిలదీశారు. బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, ఖాజీపేట రైల్వేకోచ్ ప్యాక్టరీ లను సాధించే వరకు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు స్పీకర్ దగ్గర వెల్ లోకి వచ్చి నిరసన తెలపాలని డిమాండ్ చేశారు. పోతే తెలంగాణ కోసం కేంద్ర మంత్రి పదవులు పోతాయి అని, విభజన చట్టంలోని హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం సొంతంగా అధికారంలోకి రాలేదని టీడీపీ, జనతాదళ్ పార్టీలపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడి నడుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు తెచ్చుకోవడం జరుగుతుంది. అమరావతి రాజధాని కోసం 15000ల కోట్లు తెచ్చుకోవడం జరుగుతుంది. ఏపీలో ప్రకాశం, రాయలసీమ జిల్లాలకు వెనుకబడిన జిల్లా పేరుతో పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులు చేసుకున్నారు.

ఖాజీపేట రైల్వే కోచ్ ప్యాక్టరీ కోసం 1985 నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల ప్రయత్నలోపం కారణంగానే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలుగా తాము చాలా సార్లు పార్లమెంట్‌లో కోట్లాది జాతీయ రహాదారులు, ప్రాజెక్టులకు అనుమతులు సాధించుకున్నామని తెలిపారు. కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు మంజూరు చేయలేదని, కేవలం పాత జిల్లాల్లో 9 మాత్రమే నవోదయ పాఠశాలలున్నాయి అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్ లోపభూయిష్టమైన నిర్ణయాల వల్లనే ఇయ్యల తెలంగాణలో వర్షాకాలంలో కూడా ప్రాజెక్టులు నీళ్లు లేకుండా మారినాయి అన్నారు. తను ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్‌లో కొట్లాడి బీబీ నగర్‌కు ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ తీసుకురావడం జరిగిందన్నారు. తెలంగాణలో ఈ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కోట్లాడి ప్రధాని దగ్గరకు పోయి తెలంగాణకు నిధులు కేటాయించాలని ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే దాకా పోరాట చేస్తే మనకు రావాల్సిన నిధులు తప్పకుండా సాధించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మాజీ కూడా చైర్మన్ యాదవరెడ్డి, కార్పోరేటర్స్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

newsline-whatsapp-channel
Tags : india-people brs congress bjp vinod-kumar

Related Articles