Harish Rao: కాంగ్రెస్ పాలన రైతుల పట్ల యమపాశంగా మారింది

మ్మిది నెలల కాంగ్రెస్ పాలన రైతుల పట్ల యమపాశంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.


Published Sep 08, 2024 05:22:53 AM
postImages/2024-09-08/1725786902_bogasga.PNG

న్యూస్ లైన్ డెస్క్: తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలన రైతుల పట్ల యమపాశంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మేడ్చల్‌లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు లేఖ రాసి మరీ సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని, సురేందర్ రెడ్డికి ఏపీజీవీబీలో అప్పు ఉందన్నారు. సురేందర్ రెడ్డి అమ్మకు రూ. లక్షా 15 వేలు, సురేందర్ రెడ్డికి రూ. లక్షా 92 వేలు అప్పు ఉందని, బ్యాంకు మేనేజర్ అనిరుద్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరికే రుణమాఫీ అవుతుందని చెప్పడంతో సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు. సురేందర్ రెడ్డి ఆత్మహత్య లేఖలోని ప్రతి అక్షరం రేవంత్ రెడ్డిని నగ్న స్వరూపాన్ని బయటపెట్టిందని అన్నారు. రేవంత్ రెడ్డి పూటకో మాట పొద్దు తిరుగుడు కంటే వేగంగా మారుతోందని, రేషన్ కార్డు లింకు లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని మండిపడ్డారు.

సురేందర్ రెడ్డి ఆత్మహత్య రేషన్ కార్డుకు రైతు రుణమాఫీకి ఉన్న లింక్ ఉన్నదని నిరూపితం అయ్యిందని, రేవంత్ పాలనకు సురేందర్ రెడ్డి లేఖ ఓ పంచనామా లాంటిదని తెలిపారు. రైతు రుణమాఫీ ఆంక్షలతో రేవంత్ కుటుంబ బంధాల్లో చిచ్చు పెట్టారని, కేసీఆర్ కుటుంబ బంధాలు బలోపేతం చేస్తే వాటిని విచ్ఛిన్నం చేసిన దరిద్రపు గొట్టు ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అన్నారు. తన నియోజకవర్గంలో జక్కాపూర్ గ్రామంలో గురజాల బాల్ రెడ్డి కుటుంబంలో ముగ్గురికి రుణం ఉందని, వారికి ఆరు లక్షల అప్పు ఉంటె కేవలం రెండు లక్షలే మాఫీ అవుతోందని తెలిపారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి అని, ఇది రైతుల పాలిట రేవంత్ చేసిన మోసం, దగా కాదా అని ఆయన ప్రశ్నించారు. రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి రేవంత్ ప్రభుత్వం 31 సాకులు చూపెడుతోందని మండిపడ్డారు.

నారాయణ్‌పేట గ్రామంలో నల్ల మణెమ్మ అనే రైతుకు లక్ష రూపాయల అప్పు ఉందని, ఆమె భర్త 2010లో మరణించారు.. ఆయన ఆధార్ కార్డు తెస్తేనే రుణమాఫీ చేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. 2010లో ఆధార్ కార్డే ఇవ్వనప్పుడు ఆధార్ కార్డు ఎలా తెస్తారు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కుంభాల సిద్ధారెడ్డి, చాట్ల హరీష్ అనే రైతులకు భార్యల ఆధార్ కార్డులు తెమ్మంటున్నారు. వారికి పెళ్లిళ్లే కాలేవు.. ఆధార్ కార్డులు ఎక్కడ్నుంచి తెస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్ళు ఎంత మందో ఉన్నారు.. రుణమాఫీ కోసం వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోవాలా అని ప్రశ్నించారు. 20 లక్షల మందికే ఇప్పటిదాకా రుణమాఫీ అయ్యింది.. 21 లక్షల రైతుల మందికి ఇంకా కావాలని, రుణమాఫీ అయ్యింది నన్ను బావిలో దూకమని రేవంత్ అంటున్నారు.. ఇపుడు ఎవరు బావిలో దూకారు అని ఎద్దేవా చేశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs farmers cm-revanth-reddy congress-government harish-rao runamafi

Related Articles