BRS: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆగడాలు.. ఖండించిన హరీష్ రావు

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వేధింపులు భరించలేక నస్పూర్ మున్సిపల్ 21 వ కౌన్సిలర్ బేర సత్యనారాయణ గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం దారుణం అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.


Published Aug 18, 2024 07:29:11 PM
postImages/2024-08-18/1723989551_brshfire.PNG

న్యూస్ లైన్ డెస్క్: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వేధింపులు భరించలేక నస్పూర్ మున్సిపల్ 21 వ కౌన్సిలర్ బేర సత్యనారాయణ గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం దారుణం అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈ ఘటనపై ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా, పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి అరెస్టులు చేయించాలని చూడటం హేయమైన చర్య అని అన్నారు. 

తెలంగాణ రాజకీయాల్లో ప్రతీకార చర్యల సంస్కృతికి స్థానం లేదని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిత్యకృత్యం అవుతున్నాయి అని, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఆయన ఖండించారు. బాధ్యుల పట్ల తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి కఠినంగా వ్యవహరించాలనీ, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని హరీష్ రావు కోరారు.

newsline-whatsapp-channel
Tags : india-people fire mla brs congress cm-revanth-reddy harish-rao mla-

Related Articles