హైదరాబాద్ లో ఛార్జీలను ఎంత పెంచాలనే అంశంపై ఎల్ అండ్ టీ కసరత్తులు చేస్తుంది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోవడంతో ఛార్జీలను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.
ఇది వరకే బెంగుళూరు మెట్రోఛార్జీలను 44 శాతం మేర పెంచారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఛార్జీలను ఎంత పెంచాలనే అంశంపై ఎల్ అండ్ టీ కసరత్తులు చేస్తుంది ఇందులో భాగంగానే హాలిడే సేవర్ కార్డు ,మెట్రోకార్డుపై లభించే 10 శాతం డిస్కౌంట్ ను తొలగించింది.
మెట్రో రైలు ప్రాజెక్ట్ కారణంగా ఎల్ అండ్ టీ సంస్థ భారీ నష్టాలను ఎదుర్కొంటుంది. సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు రూ. 6,500 కోట్ల నష్టం వాటిల్లిన్లు సమాచారం . ఛార్జీల పెరుగుదల కోసం ఎల్ అండ్ టీ గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది అయితే చాలా కారణాల వల్ల ప్రభుత్వం ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదు.