odela2: తమన్నా ఓదెల 2 హిట్టు పడిందా... రివ్యూ !


ఓదెల వన్ లో  తిరుపతి ను అతడి భార్య రాధ చంపేసిన తర్వాత ఊరు అంతా పండగ చేసుకుంటుంది.


Published Apr 17, 2025 03:45:00 PM
postImages/2025-04-17/1744884959_newproject20250322t0950486521742624876.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : 2022 లో ఆహాలో నేరుగా రిలీజైన సినిమా ఓదెల రైల్వే స్టేషన్ . అప్పట్లో ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమాకు సీక్వెల్ గా ఓదెల 2 తెరకెక్కించారు సంపత్ నంది. డైరక్షన్ ఒక్కటే చెయ్యలేదు కాని సినిమా అంతా నడిపించింది సంపత్ నందే. తమన్నా రాకతో సినిమాకు స్టార్ సినిమా టచ్ వచ్చింది.


ఓదెల వన్ లో  తిరుపతి ను అతడి భార్య రాధ చంపేసిన తర్వాత ఊరు అంతా పండగ చేసుకుంటుంది. తిరుపతి శవానికి పోస్ట్ మార్టమ్ చేసి ఊరికి తీసుకొస్తే  కనీసం ఆత్మకు కూడా శాంతి కలగకూడదని సమాధి శిక్ష వేస్తారు. దాంతో తిరుపతి మరణం తర్వాత మళ్లీ ఆ ఊళ్లో పెళ్లిళ్లు మొదలవుతాయి. అదే టైంలో తిరుపతి ఆత్మ బయటకు వచ్చేస్తుంది. ఊళ్లో కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలను శోభనం రోజే చంపేస్తుంటుంది. ఆ మరణాల ఘోషను తట్టుకోలేక జైల్లో రాదమ్మ దగ్గరికి  ఉపాయం కోసం వెళ్తారు ఊరు జనం.  అప్పుడు వాళ్లకు తన అక్క భైరవి గురించి చెప్తుంది.చిన్నప్పటి నుంచి నాగసాధువుగా మారిపోయి శివుడిలో ఏకం కావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది భైరవి. ఆమె ఓదెలలో అడుగు పెడుతుంది. మరి తన దైవశక్తితో దుష్టశక్తిని అంతం చేసిందా లేదా అనేదే అసలు కథ.


ఓదెల రైల్వేస్టేషన్ సినిమా నేరుగా ఓటిటిలో విడుదల కావడంతో చాలా మందికి ఫస్ట్ పార్ట్ కథేంటో తెలియదు. మరో వైపు రాధ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఊళ్లోనే ఉంటాడు. ఒకరోజు ఊళ్లో హత్యలు చేసేది తన బర్తే అని తెలుసుకొని తిరుపతి తలనరికి చంపేస్తుంది రాధ.అలా ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. సెకండ్ పార్ట్ సరిగ్గా తెగిన తల దగ్గర్నుంచే మొదలు పెట్టాడు సంపత్ నంది. తిరుపతి శవాన్ని ఊరికి తీసుకురావడం.. ఆయన చేసిన దారుణాలు చూసి ఆత్మకు శాంతి లేకుండా చేయాలని ఊరు జనం సమాధి శిక్ష వేయడంతో కథ మొదలవుతుంది. ఓదెల 2 విషయంలో అది మిస్ అయింది.. ఫస్ట్ 15 నిమిషాలు ఆసక్తికరంగా మొదలైన కథ.. ఆ తర్వాత చాలా చప్పగా సాగింది. క్లైమాక్స్ ఏమో హనుమాన్ సినిమాకు కాపీలా అనిపించింది. తమన్నా ను చూడాలంటే ఇంటర్వెల్ వరకు ఆగాల్సిందే.నాగ సాధువు పాత్రలో మ్యాగ్జిమమ్ మెప్పించడానికి ప్రయత్నించింది. వశిష్ట ఎన్ సింహా ప్రేతాత్మగా బాగానే చేసాడు.. అయితే డబ్బింగ్ సెట్ కాలేదు. హెబ్బా పటేల్ చిన్న పాత్రలో కనిపించింది. అసలు సంపత్ నంది రైటింగ్ చాలా వీక్ అనిపించింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోరావల్సిందే. ఓవరాల్‌గా ఓదెల 2.. అంతా శివార్పణం..

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news review hebbah-patel, tamannaah

Related Articles