uttarpradesh: ఇందుకోసమే అల్లుడుతో పారిపోయానంటున్న పిల్ల తల్లి !

రీసెంట్ గా స్వప్న, రాహుల్ పోలీసులు ముందుకు వచ్చారు. ఇద్దరు పారిపోవడానికి గల కారణాలను వారు వివరించారు.


Published Apr 17, 2025 05:44:00 PM
postImages/2025-04-17/1744892293_cr20250417tn6800aa51513f8.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: తన కూతరికి కాబోయే భర్తతో  పారిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. యూపీలోని అలీఘర్ లో వారం క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. స్వప్న అనే మహిళ తనకు కాబోయే అల్లుడు రాహుల్ తో వెళ్లిపోయింది. రీసెంట్ గా స్వప్న, రాహుల్ పోలీసులు ముందుకు వచ్చారు. ఇద్దరు పారిపోవడానికి గల కారణాలను వారు వివరించారు.


తన భర్త బాగా తాగి వచ్చి తనను కొట్టేవాడని ..తన కూతురు కూడా తనతో తరచుగా గొడవలు పడేదని స్వప్న తెలిపింది. అందుకే రాహుల్ తో వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. తను అతడినే పెళ్లి చేసుకుంటానని అతనితోనే ఉంటానని తెలిపింది. తన కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు తాను రూ. 4 లక్షల డబ్బులు , రూ.5 లక్షలు విలువ చేసే బంగారం తీసుకెళ్లలేదని చెప్పింది. తన మొబైల్ ఫోన్ రూ.200 మాత్రమే తీసుకెళ్లానని తెలిపింది. అలీఘర్ బస్టాండ్ కు రాకపోతే ప్రాణాలు తీసుకుంటానని స్వప్న బెదిరించిందని... అందుకే తాను వెళ్లానని చెప్పాడు. ఫస్ట్ లక్నో కు వెళ్లామని తెలిపాడు. అక్కడి నుంచి ముజఫర్ నగర్ కు వెళ్లామని తమ గురించి పోలీసులు వెతుకుతున్నారనే వార్త తెలిసిన తర్వాత వెనక్కి వచ్చేశామని చెప్పాడు. స్వప్న ను పెళ్లి చేసుకుంటానని తెలిపాడు.  అయితే స్వప్న ను పెళ్లి చేసుకోవడం తర్వాత కాని తల్లిని మాత్రం తిరిగి ఇంటికి రానివ్వమని తెలిపారు. అంతేకాదు ఇంటి నుంచి వెళ్లేటపుడు తీసుకువెళ్లిన బంగారం తిరిగి తీసుకురావాలని కోరారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu police uttarapradesh

Related Articles