viral: వామ్మో..కారు డిక్కీలో మనిషి చెయ్యి....జనాలు ఎంత ఆశ్చర్యపోయారంటే !

ఒక స్థానికుడు కారు డిక్కీ వెలుపల చెయ్యి వేలాడుతూ వెళ్తుంది. వెంటనే వెనుక వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 


Published Apr 17, 2025 01:13:00 PM
postImages/2025-04-17/1744875948_ViralVideo47.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రన్నింగ్ లో ఉన్న ఇన్నోవా కారు డిక్కీ నుంచి మనిషి చెయ్యి వేలాడుతూ కనిపించింది. చంపేశారా ...చనిపోయిన వ్యక్తిని అలా తీసుకెళ్లారా అంటూ రోడ్డుపై జనాలు గుసగుసలాడుకుంటున్నారు. నవీ ముంబైలోని వాషిలో ఈ ఘటన జరిగింది. వైరల్ క్లిప్ లో ఒక స్థానికుడు కారు డిక్కీ వెలుపల చెయ్యి వేలాడుతూ వెళ్తుంది. వెంటనే వెనుక వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 


ముంబై వాషిలో సోమవారం సాయంత్రం 6.45 గంటలటైంలో  ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన సోషల్ మీడియా ప్లాట్ పామ్ లో పోస్ట్ చేయబడిన వెంటనే వైరల్ అయ్యింది. వెంటనే నవీ ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్నోవా కారు నంబర్ ప్లేట్ ఆదారంగా కారు యజమానిని పోలీసులు గుర్తించారు. తీరా ఆరా తీస్తే ఆ వీడియో ల్యాప్ టాప్ దుకాణం అడ్వర్టైజ్ మెంట్ లో భాగంగా షూట్ చేశారట. వీడియో లో కనిపించిన కారు ఇంకా వీడియో రికార్డ్ చెయ్యబడిన వెహికల్ రెండు ఒకరివే. ఈ సరదా సంఘటనలో పాల్గొన్న అబ్బాయిలు ముంబైకి చెందినవారు. ఓ వివాహానికి హాజరు కావడానికి నవీ ముంబైకి వచ్చారు. అధికారులు అబ్బాయిలను పట్టుకుని విచారించారు. విచారణలో ఎలాంటి నేరం జరిగినట్లు రుజువు కాలేదని తేల్చారు. ఇదంతా స్కిట్ అని తెలిపారు పోలీసులు. 


 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu car deadbody

Related Articles