Hyderabad: చిన్న కుక్కపిల్లల్ని నేలకేసి కొట్టి చంపేసిన వ్యక్తి !

హైద‌రాబాద్ ఫతేనగర్‌లోని హోమ్ వ్యాలీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అపార్ట్ మెంట్ సెల్లార్ లో తన పెంపుడు కుక్క దగ్గరకు వీధి కుక్క వచ్చింది.


Published Apr 17, 2025 04:50:00 PM
postImages/2025-04-17/1744888994_images2.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఓ వ్యక్తి కృర మృగంలా ప్రవర్తించాడు. మూగజీవుల పట్ల కర్కశత్వంగా వ్యవహరించారు. రోజుల వయసు ఉన్న కుక్క పిల్లలను చాలా దారుణంగా నేలకేసి కొట్టి చంపేశాడు. అయితే కుక్క పిల్లలు అన్ని చనిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు ఆ అపార్ట్ మెంట్ లోని సీసీటీవీ కెమరాలను పరిశీలించగా ఈ విషయం వెలుగు చూసింది.


హైద‌రాబాద్ ఫతేనగర్‌లోని హోమ్ వ్యాలీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అపార్ట్ మెంట్ సెల్లార్ లో తన పెంపుడు కుక్క దగ్గరకు వీధి కుక్క వచ్చింది. ఇది నచ్చని కుక్క ఓనర్ వీధి కుక్క సెల్లర్ లో పెట్టిన చిన్న కుక్కపిల్లల్ని నేల కేసి  కొట్టి చంపేశాడు. ఆ అపార్ట్ మెంట్ లో ఉంటున్న వ్యాపారి ఆశిష్ ఈ దారుణానికి పాల్పడినట్లు సీసీటీవీ ఆధారంగా తెలిసింది. దాంతో అతనిపై అల్వాల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాధు చేశారు. ఇక‌ ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో జంతుప్రేమికులు, నెటిజ‌న్లు స‌దరు వ్య‌క్తిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu hyderabad viral-news dog kill

Related Articles