యాత్రకు సమయం ముంచుకొస్తుండడంతో డబ్బులేని పరిస్థితుల్లో తన భర్త కోసం సబితా ఇంద్రారెడ్డి తన 20 తులాల బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టారు.
న్యూస్ లైన్ డెస్క్: సబితా ఇంద్రారెడ్డి భర్త పట్లోళ్ల ఇంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన తొలి తరం నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూడా తెలంగాణ కోసం ఆయన పాదయాత్ర ప్రకటించారు. అయితే ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. కాగా, యాత్రకు సమయం ముంచుకొస్తుండడంతో డబ్బులేని పరిస్థితుల్లో తన భర్త కోసం సబితా ఇంద్రారెడ్డి తన 20 తులాల బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టారు. వచ్చిన డబ్బుతో తన భర్త ఇంద్రారెడ్డి పాదయాత్ర దిగ్విజయంగా జరిగింది. ఇక హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో భర్త కట్టించిన ఇంటిలోనే ఇప్పటికే సబితా ఉంటున్నారు. ఆమె మంత్రిగా పని చేసినా కూడా ఇక్కడి నుంచే పని చేసేవారు.
సర్పంచ్‌గా గెలిచిన ఇంద్రారెడ్డి అనంతరం నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పని చేశారు. మరణానంతరం సబిత రాజకీయాల్లోకి వచ్చిన వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వైఎస్సార్, కిరణ్ కుమార్, రోశయ్య, కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన సుదీర్ఘ అనుభవం ఆమెది. తెలంగాణ వచ్చాక తనకు అమితమైన గౌరవం ఇచ్చిన కేసీఆర్ వెంటే తాను ఉంటానని ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.