పోలీసుల చేతిలో చిత్రహింసకు గురైన షాద్ నగర్ దళిత మహిళను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ వాణీదేవి తదితరులు పరామర్శించారు.
న్యూస్ లైన్ డెస్క్ : పోలీసుల చేతిలో చిత్రహింసకు గురైన షాద్ నగర్ దళిత మహిళను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ వాణీదేవి తదితరులు పరామర్శించారు. బాధితురాలి పరిస్థితి దయానీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అని చూడకుండా రాత్రి సమయంలో పురుష పోలీసులు ఎలా తీసుకెళ్తారంటూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాళ్లు చేతులు కట్టేసి అర్థరాత్రి 2 గంటల దాక నరకయాతన.
కొవ్వొత్తులు, కారంతో.!
అది చూడలేక పారిపోయిన లేడి కానిస్టేబుల్
భర్త, కొడుకు ముందే బట్టలిప్పి..!
పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో సీన్ టు సీన్ చెప్పిన బాధితురాలు సునీత. pic.twitter.com/KWvpQKnw09 — News Line Telugu (@NewsLineTelugu) August 5, 2024
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని.. ఏకంగా పోలీసులే బాధితుల పట్ల, ప్రజల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. పేదలు, బడుగు బలహీన వర్గాలను ఏదో ఒక రకంగా హింసకు గురి చేసి చేయని నేరాన్ని ఒప్పుకునేలా చేస్తున్నారని సబితా రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి హోం మంత్రి లేకపోవడం వల్లే పోలీసుల చర్యలు అదుపు తప్పుతున్నాయని ఆమె అన్నారు. బాధితురాలికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.