ఢిల్లీ ఇచ్చిన రూ. 500 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని అన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని అన్నారు. BRS అధికారంలో ఉండగా.. ప్రతి నెల రూ. 275 కోట్లు విడుదల చేసేవాళ్లమని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ పెండింగ్ బిల్లులను చెల్లించలేదని సర్పంచులు అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 2019-24 మధ్య పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అప్పుల బాధ తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా.. సమస్యలను మాత్రం పరిష్కరించలేదని సహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే సర్పంచులకు BRS సంఘీభావం లభించింది. ఈరోజు అరెస్టయిన మాజీ సర్పంచులను తిరుమలగిరి పోలీసు స్టేషన్‌లో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు BRS నాయకులు కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం కనిపిస్తుందని విమర్శించారు.
సర్పంచులు ఏం తప్పు చేశారు.. ప్రజలకు సేవ చేయటం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. వడ్డీలకు తెచ్చి, గ్రామాల్లో కార్యక్రమాలు చేశారని తెలిపారు. ఢిల్లీ ఇచ్చిన రూ. 500 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని అన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని అన్నారు. BRS అధికారంలో ఉండగా.. ప్రతి నెల రూ. 275 కోట్లు విడుదల చేసేవాళ్లమని అన్నారు.
ఢిల్లీ నుంచి ఉపాధి హామీ పథకం నుంచి వచ్చిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిందని ఆయన ఆరోపించారు. పెండింగ్ నిధుల కోసం సర్పంచులు పోరాడితే వారిని అన్యాయంగా అరెస్టు చేశారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.