తెలంగాణ తల్లిని, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తే ఊరుకోమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ తల్లిని, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తే ఊరుకోమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సెక్రటేరియట్ ఎదురుగా పెట్టే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము తిరిగి అధికారంలోకి రాగానే సకల మర్యాదలతో తొలగించి.. కాంగ్రెస్ వాళ్లు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతామని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటే విధంగా కేసీఆర్ సచివాలయం కట్టారని ఆయన అన్నారు. కానీ ప్రాజెక్టుకు రాజీవ్ గాంధీ పేరు ఉంటే మా ప్రభుత్వంలో పేరును మార్చలేదని అన్నారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నామని, కానీ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. మళ్లీ తమ ప్రభుత్వం వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని, అలాగే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పేరును కూడా మారుస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.