ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాజ్యాధికారం కొరకు పాటుపడిన మహానుభావుడు సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సిరిసిల్లలో వారి విగ్రహనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాజ్యాధికారం కొరకు పాటుపడిన మహానుభావుడు సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంతో పాల్గొనడంతో పాటు.. తెలంగాణ ప్రాంతంలో అప్పట్లో ఉన్న నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది పాపన్ననే గుర్తు చేశారు. సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలన్న సంకల్పంతో గౌడన్నల సంక్షేమం కొరకు ఆనాడు కేసీఆర్ ఎన్నో మంచి పనులు చేశారని తెలిపారు. గౌడన్నల కొరకు చెట్లపై పన్నులు తీసివేసి వారి కుల వృత్తిని కాపాడింది కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు.
గౌడ కులస్తులకు 15% రిజర్వేషన్ కల్పించి వైన్ షాపులు కేటాయించామని తెలిపారు. గత ప్రభుత్వంలో నీరాను ప్రోత్సహించి ట్యాంక్ బండ్‌పై నీరా కేఫ్ పెట్టి నీరా వల్ల ఉపయోగాలు ప్రజలకు చెప్పడం జరిగింది.. దానివల్ల ఉపాధి కూడా కలిగిందని కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వంలో 1000 పైగా గురుకులాల ఏర్పాటుచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఆరున్నర లక్షల మంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించామన్నారు. సర్వాయి పాపన్న మహానీయుడి విగ్రహం ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసి.. తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లాకు అతని పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.