bunnyvasu: గీతా ఆర్ట్స్ బ్యానర్ కు థియేటర్లు లేవా ?

 ఆయ్ సినిమా కంచిపల్లి అంజి డైరక్ట్ చేస్తున్నారు . రిలీజ్ డేట్ వచ్చేస్తుంది ..కాని థియేటర్లు లేవంటు బన్ని వాసు తెగ ఫీలయ్యారు.


Published Aug 08, 2024 01:09:00 PM
postImages/2024-08-08/1723102798_ayye.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆ నలుగురి చేతిలోనే ఉందంటారు ఇండస్ట్రీ జనాలు..పేర్లు చెప్పలేం గొడవలైపోతాయి. కాని అందులో ఒకరు మాత్రం మెగా స్టార్ బావమరిదండోయ్ ..అదేనండి అల్లు అరవింద్ ఒకరు. అయితే రీసెంట్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్ని వాసు ప్రొడ్యూస్ చేస్తున్న  ఆయ్ సినిమా కంచిపల్లి అంజి డైరక్ట్ చేస్తున్నారు . రిలీజ్ డేట్ వచ్చేస్తుంది ..కాని థియేటర్లు లేవంటు బన్ని వాసు తెగ ఫీలయ్యారు.


ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్, న‌య‌న్ సారిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. అంజి కంచిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వ‌హిస్తున్నాడు.గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ చిత్రం ఆగ‌ష్టు 15 విడుద‌ల కానుంది. అసలు ఆయ్ సినిమానే ఫస్ట్ రిలీజ్ డేట్ 


ఈ సంద‌ర్భంగా వ‌రుస ప్ర‌మోష‌న్స్‌లో పాల్గోటుంది చిత్ర‌యూనిట్. అయితే తాజాగా నిర్మాత బ‌న్నీ వాసు మూవీ గురించి మాట్లాడుతూ.. త‌న సినిమాకు థియేట‌ర్‌లు దొరకడం లేదని తెలిపాడు. ఆగ‌ష్టు 15న రామ్ పోతినేని డ‌బుల్ ఇస్మార్ట్‌తో పాటు ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. దీనితో పాటు త‌మిళం నుంచి తంగ‌లాన్ వ‌స్తుంది. ఈ సినిమాలన్నింటి ఎఫెక్ట్ ఆయ్ మీద పడిందట.

 గీతా ఆర్ట్స్ బ్యానర్లో వస్తున్న సినిమాకు థియేటర్లు లేవా...అల్లు అరవింద్ సింగిల్ స్క్రీన్ థియేట‌ర్‌లు ఒక్క‌టి కూడా లేవు. ఇది కూడా బన్నీ వాసు చెప్పారు. అత‌డికి ఏకైక థియేట‌ర్.. అల్లు అర్జున్ ఏసియన్ మాల్ అది మాత్ర‌మే అంతకుమించి ఒక్క‌టి కూడా త‌న సోంతంగా లేవు అంటూ బ‌న్నీ వాసు వెల్ల‌డించాడు. ఆగష్టు 15 రానున్న ఈ సినిమా పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మంచి అంచనాలు ఉన్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr movie-news allu-aravindh

Related Articles