దేశంలోని బెస్ట్ కాలేజీల లిస్ట్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్ వర్క కింద ఈ జాబితా విడుదల చేసింది. వివిధ ప్రమాణాల ఆధారంగా ర్యాంక్ ను వెల్లడించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు.
న్యూస్ లైన్, ఢిల్లీ: దేశంలోని బెస్ట్ కాలేజీల లిస్ట్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్ వర్క కింద ఈ జాబితా విడుదల చేసింది. వివిధ ప్రమాణాల ఆధారంగా ర్యాంక్ ను వెల్లడించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. యూనివర్సిటీలు, కాలేజీలు, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్లు, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, మెడికల్ తో సహా మొత్తం 13 విభాగాల్లో ర్యాంకులను ప్రకటించారు. దేశంలోని బెస్ట్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ నిలిచింది. ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ మద్రాస్ వరుసగా తొమ్మిదోసారి టాప్ లో నిలిచింది. రెండో స్థానంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు చోటు దక్కించుకుంది. టాప్ 10లో 8 ఐఐటీ కాలేజీలు, ఎయిమ్స్ ఢిల్లీ, జేఎన్‌యూలు నిలిచాయి.
మెడికల్ విభాగంలో ఢిల్లీ ఎయిమ్స్ టాప్ ప్లేస్‌లో ఉంది. మేనేజ్‌మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. ఐఐఎస్‌సీ బెంగళూరు బెస్ట్ యూనివర్సిటీగా ఎంపికైంది. బెస్ట్ లా కాలేజీ కేటగిరిలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా ఉంది. ఇంజినీరింగ్ టాప్ ఇన్‌స్టిట్యూషన్స్ కేటగిరిలో హైదరాబాద్ ఎన్ఐటీ 8వ స్థానంలో నిలించింది. లా కాలేజీ విభాగంలో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్ థర్డ్ ప్లేస్ దక్కించుకుంది.