నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారానికి సంబంధించినటువంటి వార్తలకు ఇప్పటినుంచి చెక్ పడ్డట్టే. తాజాగా నాగచైతన్య మరో స్టార్ హీరోయిన్ అయినటువంటి శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ ఘనంగా చేసుకున్నారు. ఈ
న్యూస్ లైన్ డెస్క్: నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారానికి సంబంధించినటువంటి వార్తలకు ఇప్పటినుంచి చెక్ పడ్డట్టే. తాజాగా నాగచైతన్య మరో స్టార్ హీరోయిన్ అయినటువంటి శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ ఘనంగా చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున కూడా అఫీషియల్ గా ప్రకటించారు. ఇదే తరుణంలో మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి నాగార్జున తప్ప అమల, అఖిల్ హాజరు కాలేదని, వీరి మధ్య ఏదో వైరం పుట్టిందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. సమంత, నాగచైతన్య ప్రేమ వివాహం చేసుకొని నాలుగేళ్ల పాటు కాపురం చేసిన తర్వాత విడాకుల ద్వారా దూరమైపోయారు. ఆ తర్వాత ఎవరి కెరియర్ వారు చూసుకుంటూ ఉంటున్నారు. ఇదే తరుణంలో సమంత ఒంటరిగానే ఉంటూ సినిమాలపై దృష్టి పెట్టింది.
కొన్ని నెలల పాటు మయోసైటీస్ బారినపడి ఇబ్బందులు పడ్డ సమంత దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొని సినిమాల్లో దూసుకుపోతోంది. నాగచైతన్య కూడా తర్వాత సినిమాలపై దృష్టి పెట్టి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ తో ఆయనకు రిలేషన్ ఏర్పడిందని, ఇది కాస్త ప్రేమగా మారిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం చేస్తూ తాజాగా వీరిద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.
ఈ ఎంగేజ్మెంట్ దగ్గరి కుటుంబీకుల మధ్య చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమానికి సంబంధించి నాగార్జున, నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల కలిసి ఒక ఫోటో దిగారు. ఈ ఫోటోలను నాగార్జున సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటోలో ఎక్కడ కూడా అమల, అఖిల్ కనిపించకపోవడంతో అక్కినేని కుటుంబంలో కొత్త కోడలు ఇప్పుడే చిచ్చు పెట్టింది అంటూ కొన్ని వార్తలు షికార్లు కొడుతున్నాయి.