Supreme: ఢిల్లీలో చక్రం తిప్పుతున్న బాబు.. ఓటుకు నోటు కేసులో రేవంత్ సేఫ్..?

దీంతో రాజకీయ కక్ష సాధింపులకు కోర్టును వేదిక చేయొద్దని ధర్మాసనం న్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆళ్ల రామకృష్ణారెడ్డిని జస్టిస్‌ సుందరేష్ మందలించడం గమనార్హం. అంతేకాకుండా, హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. 


Published Aug 21, 2024 05:21:38 AM
postImages/2024-08-21/1724234630_chandrababu.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఓటుకు నోటు కేసులో ఆళ్ల రామకృష్ణ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టేసింది. దీంతో ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును చేర్చాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్లు వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు పాత్రపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై బుధవారం సుప్రీం కోర్టులో జస్టిస్‌ ఎంఎం.సుందరేష్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ ధర్మాసనం విచారణ జరిపింది. 

అయితే, ఈ పిటిషన్లను సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టేసినట్లు తెలుస్తోంది. రాజకీయ కక్ష సాధింపుల కోసమే ఈ పిటిషన్లు దాఖలు చేశారని చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదించారు. దీంతో రాజకీయ కక్ష సాధింపులకు కోర్టును వేదిక చేయొద్దని ధర్మాసనం న్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆళ్ల రామకృష్ణారెడ్డిని జస్టిస్‌ సుందరేష్ మందలించడం గమనార్హం. అంతేకాకుండా, హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. 

ఇది ఇలా ఉండగా.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు రావడంతో పెద్ద స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. NDA కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు.. ఢిల్లీలో పెత్తనం చెలాయిస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం నుండి బలమైన మద్దతు లభిస్తోందని కూడా చెబుతున్నారు. అందుకే, ఓటుకు నోటు కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెబుతున్నారు. 

మరోవైపు ఆయన శిష్యుడిగా పేరు గాంచిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే. ఈ కేసు కూడా సుప్రీం వరకు వెళ్తుంది. ఇక ఈ కేసులో నుంచి రేవంత్ రెడ్డిని సైడ్ చేయడానికి కూడా చంద్రబాబు హస్తం ఉండే అవకాశం ఉంటుందని మరో వాదన వినిపిస్తోంది. అటు చంద్రబాబు, ఇటు రేవంత్ రెడ్డి.. ఇద్దరూ అధికారంలోనే ఉన్నారు. దీంతో మరో ఐదేళ్ల పాటు ఓటుకు నోటు కేసు పక్కన పడే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. 

newsline-whatsapp-channel
Tags : ap-news chandrababu news-line newslinetelugu tspolitics appolitics telanganam cm-revanth-reddy alla-ramakrishna-reddy

Related Articles