jack : టిల్లు కు ...హిట్ట్ పడ్డట్టే నా ...జాక్ రివ్యూ ఏంటి !

హైదరాబాద్ తో పాటు అన్ని మేజర్ సిటీస్ లో బాంబ్ బ్లాస్ట్ చేసే ఉగ్రవాదుల ప్లాన్ ను చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు


Published Apr 10, 2025 07:42:00 PM
postImages/2025-04-10/1744294426_newproject661744267780.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : డీజే టిల్లు ..టిల్లు స్క్వేర్ మూవీలతో యూత్ లో చాలా మంచి ఫేమ్  తెచ్చుకున్నాడు . రీసెంట్ గా సిద్దు నటించిన మూవీ " జాక్ " బొమ్మరిల్లు " భాస్కర్ డైరక్షన్ లో బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా వచ్చిన మూవీ జాక్. ఈ రోజే రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లో సిద్దు మార్క్ డైలాగులు ఉండడంతో ప్రేక్షకుల్లో కాస్త బజ్ క్రియేట్ అయ్యింది. ఇక కథ లోకి వెళ్తే ..


'జాక్‌' సిద్దు ... 'రా'లో స్పై ఏజెంట్‌గా చేరాలనేది అతని కోరిక. ఉద్యోగం రాకుండానే దేశానికి సేవ చెయ్యాలనుకుంటారు. హైదరాబాద్ తో పాటు అన్ని మేజర్ సిటీస్ లో బాంబ్ బ్లాస్ట్ చేసే ఉగ్రవాదుల ప్లాన్ ను చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే రా ఏజెంట్ ప్రకాశ్ రాజ్ ను కలుస్తాడు. ప్రకాశ్ రాజ్ జాక్ ను అదుపులోకి తీసుకుంటాడు. ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ను కూడా ఏర్పాటుచేస్తాడు. డిటెక్టివ్ కూతురే వైష్ణవి జాక్ గురించి తెలుసుకుంటూ ఉంటుంది. ఆమె వలన జాక్‌ అనుకోకుండా కొన్ని చిక్కుల్లో పడతాడు? అప్పుడతను ఏం చేస్తాడు? వైష్ణవితో ఆయన ప్రేమ ఎలా చిగురించింది? జాక్‌కు స్పై ఏజెంట్‌గా జాబ్‌ వచ్చిందా లేదా? అనేది మిగతా కథ. 


మొత్తానికి బొమ్మరిల్లు భాస్కర్ చాలా రొటీన్  కథ తో ముందుకు వచ్చారు. చాలా బోరింగ్ సినిమా . చాలా సినిమాల్లో చూసినట్లే...రొటీన్ గా ఉంది.ఈ సినిమాకు ఏదైనా మైనస్ ఉంది అంటే అది కధే. హీరో క్యారక్టరే పెద్దగా అట్రాక్టివ్ గా లేదు. ఆడియన్స్ కు బోర్ కొడుతుందేమో అనే విషయం ఆలోచించలేదు. సిధ్ధు ఈ కథను ఎందుకు ఓకే చేసినట్టో అర్ధం కాదు. వైష్ణవి చైతన్య నామ్ కే వాస్ ఉంది . క్యారక్టర్ కు పెద్ద గా స్కోప్ లేదు. విజయ్‌ కె.చక్రవర్తి కెమెరా వర్క్‌, సామ్‌ సీఎస్‌ బీజీఎం సినిమాకు ప్లస్‌ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. కెరియర్ పుంజుకుంటున్న టైంలో  వైష్ణవి కాని సిధ్దు కాని ఇలాంటి కథకు ఓకే చెప్పడం అంతమంచిది కాదంటున్నారు ఫ్యాన్స్.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news siddu-jonnalagadda

Related Articles