అదనంగా చాలా క్రెడిట్ కార్డులు ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఇప్పుడు క్రెడిట్ కార్డు ఒక ట్రాప్ ..ఈ విషయం అందరికి తెలుసు. అయినా అందరు తీసుకుంటారు. అయితే ఈఎంఐ అనేది..చాలా డేంజర్ . ఫ్యూఛర్ కష్టం ..ఫ్యూఛర్ మనీ కూడా వాడేస్తున్నామని తెలీదు. ఏం చేస్తాం. రోజులు అలా ఉన్నాయి. నేటి ప్రపంచంలో క్రెడిట్ కార్డులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీకు నగదు కొరత ఉన్నప్పుడు అవి మీ ఖర్చులను సులభంగా నిర్వహించడంలో మీకు సహాయపడతాయి. కాని క్రెడిట్ కార్డులో డబ్బులు తీసుకుంటే ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి తిరిగి చెల్లించడానికి గ్రేస్ పీరియడ్ ఈ టైంలో మీరు బ్యాలెన్స్ చెల్లిస్తే మీకు ఎలాంటి వడ్డీ ఛార్జీలు ఉండవు. అదనంగా చాలా క్రెడిట్ కార్డులు ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి.
క్రెడిట్ కార్డులు క్యాష్ అడ్వాన్స్ అనే ఫీచర్ ద్వారా నగదు ఉపసంహరణలను కూడా అనుమతిస్తాయి. ఇది చాలా కష్టమైనది కూడా. పూర్తి గా లావాదేవీలు పూర్తయిన తర్వాత మనం బాధపడినా ఉపయోగం లేదు. అన్ని క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు నగదు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. కానీ మీరు యాక్సెస్ చేయగల మొత్తం మీ కార్డు పరిమితిపై ఆధారపడి ఉంటుంది. 20 నుండి 40 శాతం వరకు నగదు ఉపసంహరణలను అనుమతిస్తాయి. ఉదాహరణకు మీ క్రెడిట్ పరిమితి రూ. 5 లక్షలు అయితే, మీరు రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల మధ్య నగదు ఉపసంహరించుకోవచ్చు.
మీరు క్రెడిట్ కార్డు నుంచి లక్ష రూపాయిలు క్యాష్ విత్ డ్రా చేస్తే 3500 నుంచి 2500 మధ్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
* సాధారణ కొనుగోళ్లు మాదిరిగా కాకుండా నగదు అడ్వాన్సులకు వడ్డీ లేని గ్రేస్ పీరియడ్ ఉండదు. దీని అర్ధం మీరు ఉపసంహరించుకున్న మొత్తం పై వెంటనే వడ్డీ షురూ అవుతుంది.
* తరచుగా నగదు ఉపసంహరణలు మీ CIBIL స్కోర్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.