Chiranjeevi: రాత, తీత, మోత, కోత కలిపితే   'మత్తు వదలరా2'.!

గత కొంతకాలం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుత కామెడీ చిత్రాలు అయితే కనిపించడం లేదు. అయితే తాజాగా సినిమా మొదలు నుంచి  ఎండింగ్ వరకు కడుపుబ్బ నవ్వించే చిత్రం  మత్తు వదలరా 2 అని తెలుస్తోంది.


Published Sep 15, 2024 05:28:33 PM
postImages/2024-09-15/1726401513_mmathuvadalara2chiranjeevi.jpg

న్యూస్ లైన్ డెస్క్: గత కొంతకాలం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుత కామెడీ చిత్రాలు అయితే కనిపించడం లేదు. అయితే తాజాగా సినిమా మొదలు నుంచి  ఎండింగ్ వరకు కడుపుబ్బ నవ్వించే చిత్రం  మత్తు వదలరా 2 అని తెలుస్తోంది. రితేష్ రాణా డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ మూవీ సెప్టెంబర్ 13న థియేటర్ల లోకి వచ్చింది.

వచ్చిన మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాలో  శ్రీ సింహ హీరోగా  ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించారు.  2019లో వచ్చినటువంటి మత్తు వదలరా అనే చిత్రానికి సీక్వెల్ గా మత్తు వదలరా2 వచ్చింది. అలాంటి ఒక చిన్న చిత్రంగా వచ్చినటువంటి ఈ మూవీ  ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవిని కూడా  ఆకట్టుకుందట.

తాజాగా మత్తు వదలరా2 సినిమా చూసినటువంటి చిరంజీవి అద్భుతమైనటువంటి రివ్యూ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో నేను చూసిన సినిమాలన్నింటిలో  మత్తు వదలరా 2 చాలా బాగుందని, సినిమా స్టార్టింగ్ నుంచి చివరిదాకా కడుపుబ్బ నవ్వుకునేలా ఉందని అన్నారు.

ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ రితేష్ రానాకు ఇవ్వాలని  ఆయన మోత, కోత, తీత, రాత ప్రతిదీ చక్కగా బ్యాలెన్స్ చేస్తూ  అన్ని వర్గాల ప్రేక్షకులను నవ్వించేలా అద్భుతమైనటువంటి వినోద చిత్రంగా  తెరకెక్కించారని  అన్నారు. నవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ సినిమా తప్పకుండా చూడాలని  మిమ్మల్ని తప్పకుండా ఈ మూవీ 100% ఎంటర్టైన్ చేస్తుందని తన ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.

https://x.com/KChiruTweets/status/1835163033791816184

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu comedian-sathya mathu-vadalara-2 faria-abdullah

Related Articles