మొదటగా రెండో భాగాన్ని విడుదల చేస్తున్నారు. ‘చిన్నా’ ఫేమ్ ఎస్ యూ అరుణ్ కుమార్ డైరక్షన్ లో ఈ మూవీ వస్తుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జయాపజాయాలతో సంబంధం లేకుండా క్రేజీ సినిమాలు చెయ్యడంలో చియాన్ విక్రమ్ టాప్ లో ఉంటాడు. ఇటీవలే ఆయన తంగలాన్‌తో మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ వీర ధీర సూరన్ . కాగా ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటగా రెండో భాగాన్ని విడుదల చేస్తున్నారు. ‘చిన్నా’ ఫేమ్ ఎస్ యూ అరుణ్ కుమార్ డైరక్షన్ లో ఈ మూవీ వస్తుంది.
హెచ్ఆర్. పిక్చర్స్ పతాకంపై రియాశిబు ఈ మూవీని నిర్మిస్తున్నారు. నటి దుషారా విజయన్ కథానాయికగా నటిస్తోంది.ఈ మూవీ కి జీవీ ప్రకాశ్ మ్యూజిక్ ఇస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. నిడివి ఒక నిమిషం 47 సెకన్లు. ఎవరైనా ఉన్నారా? అని ఓ మహిళా ఓ షాపు ముందు నిల్చోని అంటుంది. అప్పుడు చేయి చూపిస్తూ విక్రమ్ కొంచెం సెలెంట్‌గా ఉండండి పాప నిద్రపోతుంది అని సైగలతో చెబుతాడు. ఈ మూవీలో విక్రమ్ ఓ కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తుంటారు. తన కుటుంబం పోషణ కు ఓ కామన్ మ్యాన్ లా ఉంటాడని టీజర్ ను బట్టి అర్ధమవుతుంది. ఆరంభంలో కుటుంబంపై ప్రేమను చూపిస్తున్నట్లు ఉన్నా లాస్ట్ లో ఓ అధ్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. టీజర్ మాత్రం అధ్భుతంగా ఉంది.