ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని(ఐఐహెచ్‌టీ)కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని(ఐఐహెచ్‌టీ)కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఐహెచ్‌టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని, ఇందుకు సంబంధించిన జీవో విడుదల చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశిస్తున్నానని అన్నారు. తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసిన కొండా లక్ష్మణ్ బాపూజీది అసలైన త్యాగం అన్నారు.
ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్ చేసిన వారిది త్యాగం కాదని ఆయన అన్నారు. ఐఐహెచ్‌టీ విద్యార్థులకు నెలకు రూ.2500 ప్రోత్సాహకం అందిస్తామని సీఎం అన్నారు. రూ.30 కోట్ల చేనేత రుణమాఫీ చేసే బాధ్యత నాది అని సీఎం అన్నారు. రుణమాఫీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రెటరీకి ఆదేశాలిస్తున్నానాని అన్నారు. రుణమాఫీ వార్తతో నేతన్నలు సంతోషంగా ఇంటికెళ్లి.. కడుపునిండా భోజనం చేయాలన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు తదితరులు హాజరయ్యారు.