కలర్ ఫొటో చిత్రం ద్వారా డైరక్టర్ సందీప్ రాజ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఈ సినిమా లో చాందినీరావు నటించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కలర్ ఫొటో చిత్రం ద్వారా డైరక్టర్ సందీప్ రాజ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఈ సినిమా లో చాందినీరావు నటించారు. అయితే ఆమెను ఈ రోజు తిరుమలలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి హీరో సుహాస్ తో పాటు చాలా తక్కువ మంది కుటుంబసభ్యుల మధ్య పెళ్లి ఘనంగా జరిగింది.
అలాగే నటుడు వైవా హర్షతో పాటు మరికొందరు ఈ వివాహ వేడుకలో సందడి చేశారు. అయితే చాందినీ రావు హెడ్స్ అండ్ టైల్స్ అనే వెబ్ సీరిస్ లో నటించారు. వీరిద్దరు షార్ట్ ఫిల్మ్స్ నుంచి వీరి ప్రయాణం మొదలయ్యింది. షార్ట్ ఫిల్మ్స్ నుంచి బిగ్ స్క్రీన్ లో వీరి టాలెంట్ చాటుకున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.
ఇక తొలి సినిమాతోనే సందీప్ రాజ్ ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో జాతీయ అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన రెండో మూవీని రాజీవ్ కనకాల, సుమ దంపతుల కుమారుడు రోషన్‌తో తెరకెక్కిస్తున్నారు. 'మోగ్లీ' పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.