హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో మ్యూజిక్ డైరక్టర్ ఆర్ పి పట్నాయక్ కంప్లెయింట్ ఇచ్చారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ర్యాగింగ్ పెనుభూతానికి మరో విద్యార్ధి ఇబ్బందిపడ్డాడు.దీనికి సెలబ్రెటీ పిల్లలు ..సామాన్యుల పిల్లలు తేడా లేదు. రీసెంట్ గా ఆర్పీ పట్నాయక్ కొడుకు కూడా ఈ ర్యాగింగ్ పెనుభూతం వల్ల ఇబ్బందిపడిన వాడే. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కు ఆర్పీ పట్నాయక్ వెళ్లడం జరిగింది. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో మ్యూజిక్ డైరక్టర్ ఆర్ పి పట్నాయక్ కంప్లెయింట్ ఇచ్చారు.
తన కొడుకు వైష్ణవ్ ని ర్యాగింగ్ చేస్తూ చెవి కొరికినట్లు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ ఫిర్యాదు చేశారు. అదే కాలేజీ లో చదువుతున్న సీనియర్ విద్యార్ధి శ్యామ్ ..వైష్ణవ్ తో గొడవ జరుగుతుంది. రోజు ఏదో రకంగా గొడవపడుతూనే ఉన్నారట. ఆ విషయం ఇంట్లో చెప్పలేదు.
కాని మొన్న బస్సులో మరోసారి గొడవ పడ్డారు. వైష్ణవ్ తో శ్యామ్ చాలా పెద్ద గొడవపెట్టుకున్నాడు. ఈ గొడవలో వైష్ణవ్ చెవి కొరికేశాడు. దీంతో… శ్యామ్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు పోలీసులు. దాదాపు ఐదు కుట్లు పడ్డాయని పిల్లలకు ర్యాగింగ్ ఆలోచనే తప్పు అని ..మనిషిని హింసించే స్థాయికి వచ్చినపుడు పిల్లలని చూడకూడదని అన్నారు ఆర్పీ పట్నాయక్.