బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా BRS పార్టీ గురించే మాట్లాడారు. అతి త్వరలో కాంగ్రెస్‌లో BRS విలీనం కావడం తథ్యమని ఆయన అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: BRS పార్టీ కోసం కాంగ్రెస్, బీజేపీలు కొట్టుకుంటున్నాయి. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం పూర్తి కాకముందే ముక్కు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ రేవంత్ రెడ్డిని కలిసిన ఫాక్స్‌కాన్ ఛైర్మన్ అండ్ సీఈవో యంగ్ లీయూ, కంపెనీ ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. ఈ చర్చ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. BRS పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో BRS విలీనం జరుగుతుందని ఆయన అన్నారు. కేసీఆర్‌కు గవర్నర్, కేటీఆర్‌కు సెంట్రల్ మినిస్టర్ ఇస్తారని.. హరీష్‌రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని అన్నారు. వాళ్ల విలీనంతో కవితకు రాజ్యసభల్కొ చోటు లభిస్తుందని అన్నారు. అంతేకాకుండా కవితకు బెయిల్ కూడా వస్తుందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
ఇది ఇలా ఉంటే.. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా BRS పార్టీ గురించే మాట్లాడారు. అతి త్వరలో కాంగ్రెస్‌లో BRS విలీనం కావడం తథ్యమని ఆయన అన్నారు. కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయమని ఆయన అన్నారు. కవిత బెయిల్‌కు, బీజేపీ ఏం సంబంధం ఉందని ఆయన ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీని విలీనం చేసుకుంటేనే AAP నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు.
అయతే, పార్టీ విలీనం అంటూ ఇటీవల పోస్టులు పెట్టిన పలు యూట్యూబ్ ఛానళ్లపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. BRS పార్టీలో విలీనం అనే ఆలోచనే లేదని ఆయన స్పష్టం చేశారు. BRS తెలంగాణ సాధన కోసం, రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే పుట్టిందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసమే పోరాడుతుందని ఆయన అన్నారు. పార్టీ విలీనం అంటూ తప్పుడు ప్రచారాం చేస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.