ఆస్కార్ నామినేటెడ్ డాక్యుమెంటరీ తీయడం అంటే మాటలా...అసలు అంతవరకు వెళ్లామంటేనే డాక్యుమెంటరీలో ఏ రేంజ్ డెప్త్ ఉందో అర్ధమవుతుంది. అసలు ఈ డాక్యుమెంటరీకి కోర్టు ఎందుకు నోటీసులు ఇచ్చిందంటే ..ఇది ట్రూ ఇన్సిడెంట్ తో తీశారు. 2013లో జార్ఖండ్‌లోని బెరో జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచారం కథగా తీసుకొని డాక్యుమెంటరీ తీశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆస్కార్ నామినేటెడ్ డాక్యుమెంటరీ తీయడం అంటే మాటలా...అసలు అంతవరకు వెళ్లామంటేనే డాక్యుమెంటరీలో ఏ రేంజ్ డెప్త్ ఉందో అర్ధమవుతుంది. అసలు ఈ డాక్యుమెంటరీకి కోర్టు ఎందుకు నోటీసులు ఇచ్చిందంటే ..ఇది ట్రూ ఇన్సిడెంట్ తో తీశారు. 2013లో జార్ఖండ్‌లోని బెరో జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచారం కథగా తీసుకొని డాక్యుమెంటరీ తీశారు.
జార్ఖండ్‌లో పదమూడేళ్ల అమ్మాయిపై ముగ్గురు కుర్రాళ్లు అత్యంత దారుణం లైంగిక దాడి చేసి చంపడానికి చూశారు. కాని తప్పించుకొని చావుకు దగ్గరగా వెళ్లి వచ్చింది. తనకు జరిగిన అన్యాయంపై పోరాడాలనుకుంది. ఎవ్వరు సాయం చెయ్యకపోగా...ఊరంతా వ్యతిరేకించింది. తండ్రి మాత్రమే ప్రోత్సహించాడు. ‘బాధితులు పోరాడాల్సిందే’ననే పిలుపునిస్తూ ఈ ఉదంతాన్ని ‘టు కిల్ ఏ టైగర్’ పేరుతో డాక్యుమెంటరీగా తీసింది నిషా పహూజా. 2024 సంవత్సరానికి ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది .
చట్టాన్ని ఉల్లంఘించి, టు కిల్ ఎ టైగర్ అనే డాక్యుమెంటరీ లో మైనర్ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ ను డాక్యుమెంటరీ తీసినందుకు గాను ...చిత్రనిర్మాత నిషా పహుజా, నెట్‌ఫ్లిక్స్‌లపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ డాక్యుమెంటరీ ని ఇఫ్పుడు నెట్ ఫ్లిక్స్ అందరు చూసేలా ఓపెన్ ప్లాట్ ఫామ్ లో పెట్టింది. దీంతో మైనర్ బాలిక కేసును ఇలా చేయడం పై కోర్టు సీరియస్ అయ్యింది కూడా. కెనడాలోని టొరంటోకు చెందిన ఎమ్మీ-నామినేట్ ఫిల్మ్ మేకర్ పహుజా మరియు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసు జారీ చేసింది. నెట్ ఫ్లిక్స్ కు ఫస్ట్ ఆపేయమని చెప్పినా టెలికాస్ట్ ఆపేయలేదు. ఆపనని కూడా చెప్పేసింది.
లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం , మైనర్ రేప్ కాబట్టి ఆపేయమని కోర్టు వాదన. "ఒక రకమైన స్టాక్‌హోమ్ సిండ్రోమ్" కారణంగా 18 ఏళ్లు నిండిన తర్వాత ప్రాణాలతో బయటపడిన ఆమె తన గుర్తింపును వెల్లడించడానికి సమ్మతిని నిరాకరించలేకపోయింది. ఇప్పుుడ ఈ కేసు ఫుల్ హీట్ నడుస్తుంది.