తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పెళ్లిళ్లు చేసుకున్న నటుడు ఎవరయ్యా అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది యాక్టర్ నరేష్. ఈయన ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇందులో ముగ్గురితో పిల్లల్ని కన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పవిత్ర లోకేష్ తో పిల్లల్ని కనడం కోసం ట్రై చేస్తున్నారట. అలాంటి నరేష్ నటుడిగా జీవితంలో సక్సెస్ అయినా కానీ, తన సొంత జీవితంలో మాత్రం తనకు నచ్చినట్టే ఉంటారు. ఎవరు ఏమనుకుంటారు అని అస్సలు ఆలోచించరు.
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పెళ్లిళ్లు చేసుకున్న నటుడు ఎవరయ్యా అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది యాక్టర్ నరేష్. ఈయన ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇందులో ముగ్గురితో పిల్లల్ని కన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పవిత్ర లోకేష్ తో పిల్లల్ని కనడం కోసం ట్రై చేస్తున్నారట. అలాంటి నరేష్ నటుడిగా జీవితంలో సక్సెస్ అయినా కానీ, తన సొంత జీవితంలో మాత్రం తనకు నచ్చినట్టే ఉంటారు. ఎవరు ఏమనుకుంటారు అని అస్సలు ఆలోచించరు.
తనకి ఏది నచ్చితే అదే చేస్తారు. ఆ విధంగానే పెళ్లిళ్ల విషయంలో కూడా ఎవరికి భయపడకుండా వరుసగా మూడు పెళ్లిళ్లు చేసుకొని అదరహో అనిపించారు. ప్రస్తుతం నాలుగో పెళ్లి ద్వారా పవిత్ర లోకేష్ తో సంసారం చేస్తున్నారు. అలాంటి నరేష్ గురించి తన పెద్ద కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. మా నాన్న ఏమో పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. నాకేమో 40 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి అవ్వడం లేదు.
ఇప్పటికే ఏజ్ బార్ బ్యాచిలర్ అంటున్నారు. కనీసం నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి కూడా ఒప్పుకోవడం లేదని బాధపడుతున్నారట. మా నాన్న ఏమో వరుసగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు నాకు 40ఏళ్ళు వచ్చిన నా పెళ్లి గురించి ఆలోచించడం లేదని, తెలియజేశారట. అలాంటి నవీన్ విజయ్ కృష్ణ ఇప్పటి వరకు పెళ్లెందుకు చేసుకోలేదని, ఒక యాంకర్ అడగగా అసలు నా కెరియర్ ఎటు వెళ్తుందో నాకే తెలియదు.
ఇప్పుడిప్పుడే నా జీవితం పై ఒక క్లారిటీ వస్తుంది. నాకు చేసుకోవాలి అనిపిస్తే తప్పక చేసుకుంటాను. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది ఏదో చేసుకోవాలని పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోతున్నారు. అలా కాకుండా పెళ్లి చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి అనుకుంటున్నాను. ఒకవేళ అన్నీ కలిసి వస్తే పెళ్లి అవుతుంది లేదంటే జీవితం మొత్తం ఇంతే అన్నట్టు మాట్లాడారు.
అంతేకాకుండా నవీన్ విజయ్ కృష్ణ హీరోగా కూడా పలు చిత్రాలు నటించారు. ఇందులో నందిని నర్సింగ్ హోమ్, ఊరంతా అనుకుంటున్నారు, ఐనా ఇష్టం నువ్వు అనే చిత్రాల్లో నటించినా అవి పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. విజయ్ కృష్ణ మాత్రం తన కుటుంబ సభ్యుల ఆస్తులపై ఆధారపడకుండా సొంతంగా ఎడిటర్ గా పనిచేస్తూ తన అవసరాలు తానే తీర్చుకుంటారట. ఇక తన నాన్న గురించి కూడా మాట్లాడారు. జీవితంలో ఎవరి స్వేచ్ఛ వారికుంటుంది. నాన్న విషయంలో నేను ఎంటర్ కాలేను అంటూ మాట్లాడారట.