చక్కగా బాటిల్ ను ముందు పెట్టుకొని, గ్లాస్ లో వేసుకోగా.. అందులో చిల్ బీరు తో పాటు ..ఐస్ అయ్యి చలితో చచ్చిపోయిన బల్లి కూడా ఉంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మగాళ్లకి ఏం సరాదాలుంటాయ్ ..జస్ట్ మందు కొట్టడం ...లైట్ గా పెళ్లాన్ని కొట్టడం తప్ప.. అసలు ఏ సరాదాలు సంబరాలు లేని నిరాడంబర జీవులు సార్ మగవాళ్లు . అలాంటి అమాయకులు తాగే బీర్లో ..మీరు కల్తీ చేసి ..చెత్త పడేస్తారా ..ఏంటి చెత్త పడేసారా ..మీకు తెలీదా..సరదా గా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో , పార్టీలో చిల్ అవుదామనుకున్నాడు ఓ బ్రదర్. ఏం చేశారో ఏమో ..పాపం ఆ కుర్రాడు బీరు జీవితంలో తాగనని శపథం చేశాడు సార్. ఏం జరిగిదంటే ..మీకు కథ చెప్పాల్సిందే.
మధ్యప్రదేశ్ లోని బేతుల్లోని ముల్లాయ్ ప్రాంతానికి చెందిన సచిన్ అనే వ్యక్తి బీరు తాగుదమని ఒక బీరు బాటిల్ ను కొనుగోలు చేశాడు. ఎంత మంచోడంటే ..బీరు సీసాను ఇంటికి తీసుకెళ్లి ...బార్య తోమిన గ్లాసు లో పోసుకొని తాగుదామని కూర్చున్నాడు. అనుకున్న విధంగానే చక్కగా బాటిల్ ను ముందు పెట్టుకొని, గ్లాస్ లో వేసుకోగా.. అందులో చిల్ బీరు తో పాటు ..ఐస్ అయ్యి చలితో చచ్చిపోయిన బల్లి కూడా ఉంది. ఎందుకంటే.. ఆ గ్లాసులో బీరు పోసుకోగానే అందులో చచ్చిన బల్లి వచ్చి పడింది. ఇంకా నయం బ్రదర్ ఆత్రంలో తాగేయలేదు.
ఆ గ్లాస్ లో ఉన్న బల్లిని తీసుకెళ్లి దుకాణదారుడిని నిలదీశఆడు. కానీ, ఆ దుకాణదారుడు ఈ విషయంపై స్పందించకుండా.. తిరిగి ఆ వ్యక్తి దుర్భాషలాడాడు. పాపం షాపు వాడు మాత్రం ఏం చేస్తాడు. ఓరే బాబు మేం తయారు చెయ్యలేదు. మా దోషం లేదు..మందు ఎక్కువై నువ్వే కథలు పడుతున్నావ్ పో ..అని నెట్టేశాడు. నాణ్యత లేని బీరు తాగితే ప్రాణాలు పోతాయని, ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు . కాని మళ్లీ ఏం డౌట్ వచ్చిందో ..ఏ పిర్యాధు చెయ్యలేదంటున్నారు అధికారులు.