వచ్చే యేడాది జూన్ లో నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రముఖనటులు విక్టరీ వెంకటేష్ , రానా దగ్గుబాటి కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైంది. ఈ సిరీస్ రెండో సీజన్ జూన్ 13నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. మొదటి సీజన్ బ్లాక్ బాస్టర్ ..ఇప్పుడు పార్ట్ 2 కూడా రిలీజ్ అవుతుంది. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ సంస్థలు దీనిని నిర్మించాయి.
కరణ్ అన్షుమాన్‌తో పాటు సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ చోప్రాలు దర్శకత్వ బాధ్యతలు పంచుకున్నారు. సీజన్ 2 లో కూడా వెంకటేష్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించగా వారితో పాటు అర్జున్ రాంపాల్ , సుర్వీన్ చావ్లా , కృతి ఖర్భందా , సుశాంత్ సింగ్ , అభిషేక్ బెనర్జీ , డినో మోరియా వంటి ప్రముఖ తారాగణం కూడా ఈ సిరీస్ లో భాగం అయ్యారు. వచ్చే యేడాది జూన్ లో నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.