DEVARA: ‘దేవర’ చెక్ పేమెంట్ తో సంబరపడిపోతున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ !

ఎన్టీఆర్ , కొరటాల శివ కాంభినేషన్ లో రూపొందుతున్న " దేవర " చిత్రం నుంచి క్రేజీ ఇన్సిడెంట్ చెప్పుకొచ్చాడు ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ . ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఎన్టీఆర్‌ అభిమానుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ‘సాదా సీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. రీసెంట్ గా తన క్యారక్టర్ కి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశాడట. దాని తాలుకూ డబ్బులు తనకు అందాయంటూ చెక్ తో పిక్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


Published Jul 18, 2024 11:19:00 AM
postImages/2024-07-18/1721281776_devara3.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎన్టీఆర్ , కొరటాల శివ కాంభినేషన్ లో రూపొందుతున్న " దేవర " చిత్రం నుంచి క్రేజీ ఇన్సిడెంట్ చెప్పుకొచ్చాడు ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ . ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఎన్టీఆర్‌ అభిమానుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ‘సాదా సీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. రీసెంట్ గా తన క్యారక్టర్ కి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశాడట. దాని తాలుకూ డబ్బులు తనకు అందాయంటూ చెక్ తో పిక్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


‘తమ్ముళ్లు.. దేవర డబ్బింగ్‌ పూర్తి చేశా. పెండిరగ్‌ అమౌంట్‌ కూడా వచ్చేసింది. యువ సుధ ఆర్ట్స్‌ క్లియర్‌ చేసేసింది’ అంటూ చెక్‌ చూపిస్తూ ఆనందంగా కేరింతలు కొట్టాడు. అంతేకాదు. తను పీజీలో ఉంటున్నానని, ఆ ప్లేస్‌ తనకు బాగా అచ్చొచ్చిందని చెబుతున్నాడు. అందులో ఉండగానే వాల్తేరు వీరయ్య, మంగళవారం, దేవర చిత్రాల్లో నటించానని, ఇప్పుడు మరో రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నానని చెప్తున్నాడు.  ఇక ఈ ప్లేసు నుంచి మాత్రం కదలనంటే కదలను అంటూ చెప్పుకొచ్చాడు.


సెప్టెంబర్‌ 27న ‘దేవర’ పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఈ చిత్రాన్ని యువ సుధ ఆర్ట్స్‌,ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్‌ రామ్‌ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ 30 వ సినిమా కావడం మరో విశేషం. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr devara

Related Articles