తాప్సి ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అంద చందాలతో ఒక ఊపు ఊపిన హీరోయిన్. మంచు మనోజ్ హీరోగా చేసినటువంటి ఝుమ్మంది నాదం చిత్రంలో హీరోయిన్ గా చేసి తనకంటూ
న్యూస్ లైన్ డెస్క్: తాప్సి ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అంద చందాలతో ఒక ఊపు ఊపిన హీరోయిన్. మంచు మనోజ్ హీరోగా చేసినటువంటి ఝుమ్మంది నాదం చిత్రంలో హీరోయిన్ గా చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి తాప్సి తెలుగు ఇండస్ట్రీలో అనేక చిత్రంలో నటించింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్ అయిపోయి ఇక తెలుగు ఇండస్ట్రీ సెట్ కాదని చెప్పి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతోంది.
అలాంటి తాప్సి కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలు, హాట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాప్సీ తాజాగా సోషల్ మీడియా వేదికగా కొంతమందికి కౌంటర్ ఇచ్చింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
సాధారణంగా సెలబ్రిటీలు అంటే ఎవరికైనా చూడాలని ఆసక్తి ఉంటుంది. అంతేకాదు వారితో ఒక సెల్ఫీ దిగితే మరింత ఆనందపడతారు. ఇదే తరుణంలో సెలబ్రిటీలు కామన్ గా బయటకు రావడం చాలా కష్టం. ఒకవేళ వచ్చారు అంటే వారికి సెక్యూరిటీ సమస్యలు ఏర్పడతాయి. జనాలు మీద పడిపోతారు. అయితే తాజాగా తాప్సికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఆమె ఇటీవల ఒక పబ్లిక్ ప్లేస్ లో కనిపించడంతో ఆమెతో ఫోటోలు దిగటానికి చాలామంది అభిమానులు ఎగబడి పోయారు.
కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి వద్దువద్దు అని చెప్పిన వినకుండా మీద పడిపోయారు.ఎక్కడపడితే అక్కడ చేయి వేసే ప్రయత్నం చేశారట.దీంతో అసహనానికి గురైన తాప్సి నేను నటిని మాత్రమే పబ్లిక్ ప్రాపర్టీని కాదు.ఈ రెండింటికి చాలా తేడా ఉంది. మీరు కెమెరా పట్టుకుని నా మీదికి రావడం ఫిజికల్ గా హ్యాండిల్ చేయడం మంచి పద్ధతి కాదు అంటూ కౌంటర్ ఇచ్చింది. నేను నో చెప్తే వారి అభిప్రాయానికి గౌరవం ఇవ్వాలని విషయం మీకు తెలిసి ఉండాలి. అంటూ తాప్సి అనడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.