అంటరానివాళ్లంటూ భోజనాల్లో కూడా దూరంగా కూర్చోమన్నారు..పా.రంజిత్ సంచలన వ్యాఖ్యలు.!

కొన్ని సంఘటనలు కొంతమంది జీవితాలనే మార్చేస్తాయి. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తాయి. కోలీవుడ్ డైరెక్టర్ ఫా.రంజిత్  జీవితంలో ఎదురైన కొన్ని కష్టాలు, తన లైఫ్ ని టర్న్ అయ్యేలా చేశాయి.


Published Sep 01, 2024 04:06:13 PM
postImages/2024-09-01/1725186973_ranjith.jpg

న్యూస్ లైన్ డెస్క్: కొన్ని సంఘటనలు కొంతమంది జీవితాలనే మార్చేస్తాయి. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తాయి. కోలీవుడ్ డైరెక్టర్ ఫా.రంజిత్  జీవితంలో ఎదురైన కొన్ని కష్టాలు, తన లైఫ్ ని టర్న్ అయ్యేలా చేశాయి. వాటిని బేస్ చేసుకుని ఆయన స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. చివరికి అంటరానితనం అనే ఆలోచనను రూపుమాపి,  తాను ఏంటో నిరూపించుకుంటున్నాడు. బంతి భోజనాల్లో తనని దూరంగా కూర్చోమన్న వారికే భోజనాలు అందించే స్థాయికి ఎదిగారు.

ఆనాడు వాళ్లు భోజనాల నుంచి దూరంగా  వెళ్లగొట్టారని బాధపడలేదు, వాళ్ళు బాధించిన ప్రతి క్షణాన్ని తాను ఎదగడానికి మెట్లుగా మార్చుకున్నాడు. అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ సినిమా డైరెక్టర్ గా మారి ఎంతోమంది ప్రజల జీవితాల్లో స్ఫూర్తిని నింపుతున్నారు.  అలాంటి ఫా.రంజిత్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు ఏంటో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

 సమాజంలోని సమస్యలనే కథలుగా రాసుకొని కమర్షియల్ గా సినిమాలను తీసుకువస్తూ మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు  రంజిత్. చిన్నప్పటి నుంచి తనలో మిగిలిన ప్రశ్నలే సినిమాలుగా తీస్తూ  ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఆయన తీసిన సినిమాల్లో కబాలి, మద్రాసు, సార్పట్టా,  కాలా, తంగలాన్ వంటి చిత్రాలు ఇండస్ట్రీలో అద్భుతమైన హిట్స్ సాధించి ప్రత్యేకమైన గుర్తింపును అందించాయి. ఇక తాజాగా చియాన్ విక్రం హీరోగా వచ్చినటువంటి తంగలాన్ హిందీలోకి కూడా రీమేక్ చేయనున్నారు.

అలాంటి రంజిత్ తను చిన్నప్పుడు ఎదుర్కొన్న కుల వివక్షపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  తన సొంత ఊర్లో ఊరికి దూరంగా ఒక మర్రి చెట్టు ఉండేదని, అక్కడ ఒక రోజు నేను కూర్చుందామని వెళ్తే ఒక పెద్దాయన వచ్చి నన్ను కింద నెట్టేసాడని తెలిపారు.  అంతేకాదు నన్ను కొట్టడానికి కూడా వచ్చాడని, నువ్వు ఇక్కడ కూర్చునే ప్లేస్ కాదని దూషించాడని అన్నారు. ఆ టైంలో ఆయన ఎందుకలా చేశారో అర్థం కాలేదు, అలాగే ఒక కిరాణా షాపుకు వెళ్లి చాక్లెట్ తీసుకుందామనుకుంటే నేను డబ్బులు ఇస్తే ఆ షాప్ యజమాని విసిరి కొట్టాడు.

అలాగే సామూహిక భోజనాలకు వెళ్ళినప్పుడు నన్ను దూరంగా కూర్చోమని అనేవాళ్లు, అంతేకాదు ఏదైనా పండగలు, జాతరలు జరిగితే అక్కడ రక్షా కట్టమంటే దూరంగా నెట్టేసేవారని చెప్పారు. ఇలా  ఎన్నో అవమానాలు  అనుభవించానని ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే మా నాన్న  మనం చిన్న కులం వాళ్ళం కదా, ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేవారని అన్నారు.  కానీ నేను టీనేజ్ కి వస్తే గాని ఈ విషయం అర్థం కాలేదు. ఊర్లో ప్రతి దగ్గర అవమానాలు ఎదుర్కొన్న కానీ స్కూల్లో మాత్రం టీచర్లు నన్ను బాగా చూసుకునేవారు.

ఎందుకంటే  చదువులో ఫాస్ట్ గా ఉండడం వల్ల వారు తెచ్చుకున్న ఫుడ్ కూడా నాకు ఇచ్చి తినమనేవారు. అలా నాతో కలిసి ఉండేవారు. కానీ డబ్బులు లేక ఇంటర్ లో చదువు ఆపి కూలీగా మారానని అన్నారు. ఆ తర్వాత గోడల మీద సైన్ బోర్డులు రాసే వరకు నేర్చుకొని మద్రాస్ ఆర్ట్స్ కాలేజీలో చేరి  నాకు వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకుంటూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి డైరెక్టర్ గా మారానని రంజిత్ తన బాధను వెళ్ళబోసుకున్నారు.

ప్రస్తుతం ఎంతోమంది పేదలకు నా సొంత ఖర్చులతో సినిమా  నైపుణ్యాలపై శిక్షణ అందిస్తున్నానని అన్నారు. త్వరలోనే "బీర్సా ముండా" చిత్రాన్ని త్వరలో చేయబోతున్నట్టు తెలియజేశారు. మీరు కూడా ఇలాంటి అవమానాలు అనుభవించి ఉంటే కామెంట్ చేయండి. కుల వివక్షను రూపుమాపడానికి నడుం బిగించండి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu vikram thangalaan kabali sarpatta kala director-p-ranjith

Related Articles