లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. రేపు గ్రేటర్ పరిధిలో విద్యా సంస్థలకు సెలవు ఇచ్చామని వెల్లడించారు. GHMC, హైడ్రా, జలమండలి,HMDA వంటి మొత్తం 610 టీమ్స్ ఫీల్డ్‌లో తిరుగుతున్నాయని అన్నారు.
న్యూస్ లైన్, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వర్గాలు చెప్పాయని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. రేపు గ్రేటర్ పరిధిలో విద్యా సంస్థలకు సెలవు ఇచ్చామని వెల్లడించారు. GHMC, హైడ్రా, జలమండలి,HMDA వంటి మొత్తం 610 టీమ్స్ ఫీల్డ్‌లో తిరుగుతున్నాయని అన్నారు.
ఆదివారం కావడంతో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు రాలేదని దాన కిషోర్ అన్నారు. అల్లాపూర్, కూకట్‌పల్లి తప్ప గ్రేటర్‌లో పెద్దగా సమస్యలు ఏమీ రిపోర్ట్ కాలేదని ఆయన వెల్లడించారు. అల్లాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో దాదాపు 60 ఇళ్లు నెలల్లో ముగినట్లు సమాచారం వచ్చిందని ఆయన అన్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఆయన సూచించారు.
పురాతన, శిధిలావస్థకు చేరిన గోడలు కూలి ప్రజలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్న దృష్ట్యా అలాంటి ప్రదేశాలను గుర్తించాల్సిందిగా ఉప కమిషనర్ లు, టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించామని దాన కిషోర్ అన్నారు. హుస్సేన్‌సాగర్ నుంచి ప్రస్తుతం 10, 400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించామని తెలిపారు.