భారీ వర్షాల కారణంగా చాదర్‌ఘాట్ వంతెన వద్ద మూసీ నదికి ప్రవాహం ఎక్కువగా ఉందని ఆమె వెల్లడించారు. మ్యాన్‌హోల్స్ తెరిచే ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ నగర వాసులకు GHMC కమిషనర్ ఆమ్రపాలి కీలక సూచనలు చేశారు. నగరంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరారు. ముంపు ప్రాంతాలలో నడవడం లేదా డ్రైవింగ్ చేయవద్దని సూచించారు.
భారీ వర్షాల కారణంగా చాదర్‌ఘాట్ వంతెన వద్ద మూసీ నదికి ప్రవాహం ఎక్కువగా ఉందని ఆమె వెల్లడించారు. మ్యాన్‌హోల్స్ తెరిచే ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా ఓపెన్ మ్యాన్‌హోల్స్ ఉంటే వెంటనే GHMC కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు.
కూకట్‌పల్లిలోని రాజీవ్ నగర్, సఫ్దర్ నగర్‌తో సహా ప్రభావిత ప్రాంతాల్లో నీటి మట్టాలను తగ్గించడానికి జోనల్ కమిషనర్, GHMC బృందాలు పని చేస్తున్నాయని ఆమె అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం GHMC హాట్‌లైన్‌ని 040-1111111 నంబర్‌కు ఫోన్ చేయాలని ఆమ్రపాలి సూచించారు.
భారీ వర్షాలపై ఆమ్రపాలి కామెంట్స్ pic.twitter.com/93pcifqKjy — News Line Telugu (@NewsLineTelugu) September 1, 2024