దేవరVsబచ్చలమల్లి.. ఎన్టీఆర్ ముందు నెగ్గుతాడా.? 2024-06-30 21:15:14

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ హీరోలు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది అల్లరి నరేష్. ఈయన తీసిన చిత్రాలు చాలావరకు  కామెడీ కథతోనే ఉంటాయి. అలాంటి అల్లరోడు  ఈ మధ్యకాలంలో  కామెడీ చిత్రాలు తగ్గించేసి కాస్త వెరైటీ కథలతో మన ముందుకు వస్తున్నాడు. అలాంటి అల్లరి నరేష్ తాజాగా చేస్తున్న చిత్రం బచ్చలమల్లి. ఈ చిత్రాన్ని సుబ్బు మంగాదేవి డైరెక్షన్ లో రాబోతోంది. హాస్య మూవీస్ బ్యానర్ పై వస్తున్నటువంటి ఈ చిత్రంలో నరేష్ మాస్ పాత్రలో నటిస్తున్నారట.  

ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. అయితే ఇదే తరుణంలో సెప్టెంబర్ 27వ తేదీన పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ రాబోతుంది. ఈ మూవీపై ఇప్పటికే అనేక అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో  బాలీవుడ్ హాట్ హీరోయిన్  జాన్వి కపూర్ నటిస్తోంది.

భారీ అంచనాలతో  కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీని  సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లోకి తీసుకురానున్నారు. అలాంటి ఈ చిత్రానికి బచ్చల మల్లి చిత్రం పోటీగా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ దేవర ముందు ఈ చిత్రం నిలబడుతుందా  అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. మరి చూడాలి దేవర సినిమా రిలీజ్ సమయంలోనే బచ్చలమల్లి రిలీజ్ చేస్తారా లేదంటే కాస్త టైం పొడిగిస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.