ఆర్తి అగర్వాల్ ఆ హీరోయిన్ వల్లే స్టార్ అయ్యిందా..?

దివంగత నటి ఆర్తి అగర్వాల్ ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది.ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా ఉండేది. అయితే అలాంటి ఈ హీరోయిన్ కి అవకాశం వచ్చింది ఆ స్టార్ హీరోయిన్ వల్లే అని తెలుస్తోంది.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.ఈ ముద్దుగుమ్మ కి నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆఫర్ రావడానికి ఆ స్టార్ హీరోయిన్ కారణమైందట. ఆమె ఎవరో కాదు ఒకప్పటి టాప్ హీరోయిన్ అయినా భూమిక చావ్లా.. భూమిక చావ్లా వల్లనే ఆర్తి అగర్వాల్ కి ఆ మూవీ లో అవకాశం వచ్చిందట. వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో భూమిక ని తీసుకుందాం అనుకున్నారట. అంతా ఓకే అనుకున్నాక ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సడన్గా భూమిక ను పక్కన పెట్టి ఆర్తి అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు.ఈ హీరోయిన్  మిస్ చేసుకోవడం వల్ల ఆర్తి అగర్వాల్ కి ఆ అవకాశం వచ్చి ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలే స్టేజ్ కి వచ్చింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-14/1720932642_bhumik.jpg

న్యూస్ లైన్ డెస్క్: దివంగత నటి ఆర్తి అగర్వాల్ ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది.ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా ఉండేది. అయితే అలాంటి ఈ హీరోయిన్ కి అవకాశం వచ్చింది ఆ స్టార్ హీరోయిన్ వల్లే అని తెలుస్తోంది.అంతేకాదు ఆ హీరోయిన్ పక్కకు తప్పుకోవడం వల్లే ఆ మూవీ వల్ల ఆర్తి అగర్వాల్ స్టార్ అయ్యిందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఆర్తి అగర్వాల్,వెంకటేష్ హీరోగా చేసిన నువ్వు నాకు నచ్చావ్ మూవీ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో ఆర్తి అగర్వాల్ కి టాలీవుడ్ లో ఆఫర్స్ పెరిగిపోయాయి. ఆ తర్వాత నువ్వు లేక నేను లేను, అల్లరి రాముడు, వీడే,నరసింహుడు, నీ స్నేహం,వసంతం, నేనున్నాను,అందాల రాముడు వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.  అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కి నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆఫర్ రావడానికి ఆ స్టార్ హీరోయిన్ కారణమైందట.

ఆమె ఎవరో కాదు ఒకప్పటి టాప్ హీరోయిన్ అయినా భూమిక చావ్లా.. అవును మీరు వినేది నిజమే. భూమిక చావ్లా వల్లనే ఆర్తి అగర్వాల్ కి ఆ మూవీ లో అవకాశం వచ్చిందట. అయితే అప్పట్లో భూమిక ఒక్కడు, ఖుషి, సింహాద్రి వంటి సినిమాలతో స్టార్ గా రాణిస్తుంది. ఆ సమయంలోనే వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో భూమిక ని తీసుకుందాం అనుకున్నారట.

అంతా ఓకే అనుకున్నాక ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సడన్గా భూమిక ను పక్కన పెట్టి ఆర్తి అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో నటించేటప్పుడు భూమిక వేరే సినిమాల్లో బిజీగా ఉంది. డేట్స్ కుదరకపోవడం వల్లనో లేక మరేదైనా కారణం కావచ్చు కానీ ఒక బ్లాక్ బస్టర్ సినిమాని భూమిక మిస్ చేసుకుంది. ఈ హీరోయిన్  మిస్ చేసుకోవడం వల్ల ఆర్తి అగర్వాల్ కి ఆ అవకాశం వచ్చి ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలే స్టేజ్ కి వచ్చింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu venkatesh aarti-agarwal bhumika nuvvu-naku-nachav-

Related Articles