సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందచందాలతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. ఒక్కోసారి అదృష్టం మన తలుపు దాకా వస్తే మనమే రిజెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత బాధపడే క్షణాలు
న్యూస్ లైన్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందచందాలతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. ఒక్కోసారి అదృష్టం మన తలుపు దాకా వస్తే మనమే రిజెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత బాధపడే క్షణాలు ఎన్నో వస్తాయి. అలా ఇండస్ట్రీలో నటీనటుల విషయంలో అలాగే జరుగుతుంది. ఒక్కోసారి ఓ చిత్రంలో నటించడం కోసం మరో చిత్రాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అనుకోని కారణాలవల్ల ఆ చిత్రాలను రిజెక్ట్ చేస్తే ఆ మూవీస్ బ్లాక్ బాస్టర్ హిట్ అయి అందులో చేసిన నటినటులకు మంచి పేరు తెచ్చి పెడతాయి.
అప్పుడు నేను ఎందుకు చేయలేదని బాధపడే క్షణాలు ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లకు వస్తూ ఉంటాయి. ఆ విధంగానే భాగ్యశ్రీబోర్సేకు కూడా అనూహ్యమైన సంఘటన ఎదురయింది. చివరికి చాలా బాధపడుతోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అయితే హీరోయిన్ భాగ్యశ్రీబోర్సే "ఆయ్" సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. ఓకే చెబుదాము అనుకునే సమయానికి హరీష్ శంకర్ నుంచి కాల్ వచ్చిందట. రవితేజ సరసాన చేస్తావా అని అడిగేసరికి ఆయ్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిందట.
అలా పెద్ద హీరో పక్కన ఛాన్స్ వచ్చిందని సంబరపడిన భాగ్యశ్రీ ఆనందం మూడు నాళ్ల ముచ్చటగానే మారింది. ఆగస్టు 15న రిలీజ్ అయినటువంటి మిస్టర్ బచ్చన్ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఆయ్ చిత్రం వీటన్నింటికీ పోటీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఆగస్టు 15 విజేతగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ విధంగా చిన్న హీరో చిన్న సినిమా అని ఆలోచించి భాగ్యశ్రీ మిస్టర్ బచ్చన్ ఒప్పుకుంటే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఆయ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాను వేస్ట్ గా వదులుకున్నానని భాగ్యశ్రీ ప్రస్తుతం బాధపడుతోందట. ఆయ్ చిత్రంలో ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నె నటించారు.