Srikanth:శ్రీకాంత్ కొడుకు రోషన్ కు చిరంజీవి వార్నింగ్ ఇచ్చారా..కారణం.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ ఎంతటి ప్రాచుర్యం సంపాదించారో మనందరికీ తెలుసు. ఆయన నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని  ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.


Published Aug 31, 2024 02:29:55 PM
postImages/2024-08-31/1725094795_roshan.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ ఎంతటి ప్రాచుర్యం సంపాదించారో మనందరికీ తెలుసు. ఆయన నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని  ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. అలాంటి మెగాస్టార్ సినిమాల ద్వారానే మంచి గుర్తింపు పొందారు హీరో శ్రీకాంత్. ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. అందుకే శ్రీకాంత్ చిరంజీవిని ఆప్యాయంగా అన్నయ్య అని పిలుస్తారు. అంతేకాదు చిరంజీవి అంటే తన సొంత అన్నయ్య కంటే ఎక్కువ అని శ్రీకాంత్ చెప్పుకొచ్చిన సందర్భాలు అనేకం.

 ఈ విధంగా వారికి సినిమాల ద్వారానే సొంత అన్న తమ్ముళ్ళ అనుబంధం కూడా ఏర్పడింది. అలాంటి శ్రీకాంత్ కొడుకు రోషన్ కు చిరంజీవి ఒక వేదిక మీద వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ చిరంజీవిని ఆయన ఏమన్నారు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు ఆ వివరాలు చూద్దాం.. అయితే చిరంజీవి కొడుకు రోషన్ పెళ్లి సందడి సినిమాకు సంబంధించిన  ఈవెంట్ లో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ అందరినీ ఆహ్వానించే క్రమంలో చిరంజీవి గారు అని పేరు పెట్టి పిలిచారు.

తర్వాత స్టేజ్ పై చిరంజీవి మాట్లాడుతూ రోషన్ నన్ను చిరంజీవి అని పేరు పెట్టి పిలిచావు, ఏం నేర్పించారు అమ్మ అంటూ శ్రీకాంత్ భార్య ఊహాను పిలిచి ఆయన నువ్వు చిన్నప్పటినుంచి ఇదే నేర్పించావా అంటూ అంటూ కామెడీగా వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత రోషన్ మాట్లాడుతూ స్టేజి పైన ఉన్నాం కదా పెదనాన్న అందుకే అలా పిలవాల్సి వచ్చింది అని నవ్వుకుంటూ చెప్పాడు.  మనం ఎక్కడ ఉంటే ఏంట్రా నువ్వు నా కొడుకు లాంటి వాడివే, మా తమ్ముడు శ్రీకాంత్ కొడుకువు కాబట్టి నన్ను ఎక్కడున్నా పెదనాన్న అని పిలువు  అంటూ చిరంజీవి ఆప్యాయంగా చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi news-line sreeleela pellisandadi roshan srikanth

Related Articles