మేజర్, క్షణం,హిట్ 2, గూడచారి వంటి సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు నటుడు అడివి శేష్.అయితే అంతకంటే ముందే పంజా సినిమాలో విలన్ గా బాహుబలి సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ చేశారు. కానీ ఈ సినిమాలు ఆయనకు అంత గుర్తింపు తెచ్చి పెట్టలేదు. డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న అడివి శేష్ 40 ఏళ్లకు దగ్గర పడుతున్నా కూడా వివాహం చేసుకోవడం లేదు.ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో అడివి శేష్ తన లవ్ స్టోరీ చెబుతూ తన పుట్టినరోజు నాడే తాను ఎంతగానో ప్రేమించిన ప్రియురాలు అలా చేసింది అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.మరి ఇంతకీ అడివి శేష్ ప్రియురాలు ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం..
న్యూస్ లైన్ డెస్క్: మేజర్, క్షణం,హిట్ 2, గూడచారి వంటి సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు నటుడు అడివి శేష్.అయితే అంతకంటే ముందే పంజా సినిమాలో విలన్ గా బాహుబలి సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ చేశారు. కానీ ఈ సినిమాలు ఆయనకు అంత గుర్తింపు తెచ్చి పెట్టలేదు. డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న అడివి శేష్ 40 ఏళ్లకు దగ్గర పడుతున్నా కూడా వివాహం చేసుకోవడం లేదు.
అయితే గత కొద్ది రోజులుగా అక్కినేని నాగార్జున మేనకోడలు యార్లగడ్డ సుప్రియ తో అడివి శేష్ ప్రేమలో ఉన్నారు అంటూ ఓ వార్త టాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు.ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో అడివి శేష్ తన లవ్ స్టోరీ చెబుతూ తన పుట్టినరోజు నాడే తాను ఎంతగానో ప్రేమించిన ప్రియురాలు అలా చేసింది అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.మరి ఇంతకీ అడివి శేష్ ప్రియురాలు ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం..
అడివి శేష్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో పాల్గొన్న సమయంలో తన లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ.. ఎవరికైనా బర్త్డే వస్తే ఎంజాయ్ చేస్తారు.కానీ నా బర్త్ డే వస్తే మాత్రం నా జీవితంలో ఓ స్యాడ్ స్టోరీ ఉంది కదా అని ఆరోజు గుర్తుకొస్తుంది. ఎందుకంటే నా బర్త్ డే రోజు నేను ఎంతగానో ప్రేమించిన నా ప్రియురాలు పెళ్లి జరిగింది.అందుకే నా బర్త్ డే జరుపుకోవాలంటే ఆ పెళ్లి గుర్తుకు వస్తుంది.
అలాగే ప్రస్తుతం నాకు పెళ్లిపై అంత ఇంట్రెస్ట్ లేదు.ఎందుకంటే పెళ్లి చేసుకున్న 80% కపుల్స్ హ్యాపీగా లేరు. అందుకే రిలేషన్స్ ఉన్నా కూడా దాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్లడం లేదు.రిలేషన్స్ ని పెళ్లి వరకు తీసుకువెళ్దామంటేనే నాకు చాలా భయంగా ఉంది అంటూ అడివి శేష్ చెప్పుకొచ్చారు.