ఆషాఢంలో ఘట్టమనేని ఇంట్లో పెళ్ళా?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా  రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చార్జీలు ఉండవు కాబట్టి, ఎవరికి నచ్చిన క్రియేటివిటీని వారు చూపిస్తున్నారు. ఇక ఈ సోషల్ మీడియా సినిమా వాళ్లకైతే  మంచి ప్రమోషన్ గా మారింది. అయితే సోషల్ మీడియాలో కొన్ని ఫన్నీ గా ఉంటే, మరికొన్ని మనకు పనికొచ్చేవి కూడా ఉంటాయి. ఇంకా కొన్ని నష్టం చేసేవి కూడా ఉంటాయి. కట్ చేస్తే సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబుకు సంబంధించినటువంటి ఒక పెళ్లి ఆహ్వాన పత్రిక వైరల్ అవుతుంది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-18/1721278321_sonali.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా  రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చార్జీలు ఉండవు కాబట్టి, ఎవరికి నచ్చిన క్రియేటివిటీని వారు చూపిస్తున్నారు. ఇక ఈ సోషల్ మీడియా సినిమా వాళ్లకైతే  మంచి ప్రమోషన్ గా మారింది. అయితే సోషల్ మీడియాలో కొన్ని ఫన్నీ గా ఉంటే, మరికొన్ని మనకు పనికొచ్చేవి కూడా ఉంటాయి. ఇంకా కొన్ని నష్టం చేసేవి కూడా ఉంటాయి. కట్ చేస్తే సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబుకు సంబంధించినటువంటి ఒక పెళ్లి ఆహ్వాన పత్రిక వైరల్ అవుతుంది.

 ఇందులో మహేష్ బాబుతో మరో హీరోయిన్ కు పెళ్లి అంటూ ఒక వివాహ ఆహ్వాన కార్డు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకేక్కిన మూవీ మురారి.  చిత్రంలో కథానాయకగా సోనాలి బింద్రే నటించింది. 2001 ఫిబ్రవరి 17న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం వచ్చి ఇప్పటికే 23 సంవత్సరాలు పూర్తయ్యాయి.

ఈ సినిమాను  మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మరోసారి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.  ఈ క్రమంలోనే మహేష్ బాబు మురారి మూవీ సినిమాకు సంబంధించి ఒక పెళ్లి ఆహ్వాన పత్రిక, ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే డిజైన్ చేసి  అందులో వరుడి పేరు స్థానంలో మురారి అని రాసి, వధువు పేరు స్థానంలో వసుంధర అని పెట్టారు. ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం అని రాసి  శ్రీ క్రోదినామ సంవత్సర శ్రావణ శుక్లపక్ష త్రయోదశి నాడు అనగా 09.08.2024 న పూర్వ ఆషాడ లగ్నమందు వివాహం చేయుటకు అభిమానులు నిర్ణయించారు.

కావున తామెల్లరు కుటుంబ సమేతంగా, బంధుమిత్రులతో మీ అభిమాన థియేటర్లకు వెళ్లి నూతన వధూవరులను  పేపర్ ముక్కలతో దీవించగలరని  కోరారు. అంతేకాకుండా విందు థియేటర్ వద్ద పాపుకాన్, కూల్ డ్రింక్, తంసప్, మౌంటెన్ డ్యూ, సమోసా మొదలగు చిరుతిళ్లు అని రాశారు. ఈ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కొ విధంగా స్పందిస్తున్నారు. చూడాలి ఈ ప్రమోషన్ ద్వారా మురారి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu marriage mahesh-babu murari vasundara sonali-bindre krishnavamshi

Related Articles