Anushka:'అనుష్క'కు ఇంట్లో వాళ్ళు పేరు పెట్టలేదా..నాగ్ నామకరణం చేశారా.?

అనుష్క తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి సీనియర్ హీరోయిన్లలో కూడా ఈమె ఒకరు.  ఇప్పటికే నాలుగు పదుల వయసు దాటి అయిదు పదులలోకి అడుగుపెడుతున్న ఈమె ఇంకా ఇండస్ట్రీలో దూసుకుపోతూనే ఉంది.


Published Aug 07, 2024 01:40:22 PM
postImages/2024-08-07/1723018222_anshukanagarjuna.jpg

న్యూస్ లైన్ డెస్క్: అనుష్క తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి సీనియర్ హీరోయిన్లలో కూడా ఈమె ఒకరు.  ఇప్పటికే నాలుగు పదుల వయసు దాటి అయిదు పదులలోకి అడుగుపెడుతున్న ఈమె ఇంకా ఇండస్ట్రీలో దూసుకుపోతూనే ఉంది.  అలాంటి అనుష్క ఇండస్ట్రీలో చేయని పాత్ర లేదు.  అలాంటి అనుష్క  అసలు పేరు ఇది కాదట. ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మరో పేరుతో వచ్చిందట. కానీ నాగార్జున ఆమె పేరు మార్చేసారని ఆమెకు అనుష్క గా నామకరణం చేసింది కూడా నాగార్జున అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.  

అనుష్క నాగార్జున హీరోగా సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటన బాగుండడంతో ఆ తర్వాత డాన్, డమరుకం, ఇలా అనేక చిత్రాల్లో నటించింది. ఇలాంటి అనుష్క చివరికి లేడి ఓరియంటెడ్  పాత్రల్లో కూడా నటించే స్థాయికి చేరుకుంది. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే అనుష్క ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆమె పేరు స్వీటీ అని ఉండేదట. ఒక నొక సమయంలో   నాగార్జున షూటింగ్ లో ఆమె పేరు ఏంటి అని అడిగేసరికి స్వీటీ అని చెప్పిందట.

నీ అసలు పేరు చెప్పు అని మళ్లీ అడిగితే మళ్లీ స్వీటీ అన్నదట.  స్వీటీ అనేది పూర్తి పేరు కాదు కదా ముద్దుగా పిలుచుకునే పేరు కదా అని నాగార్జున అన్నారట.  లేదు నా పేరు స్వీటీ అని అనుష్క బదులిచ్చిందట. దీంతో ఈ పేరు నాకు నచ్చలేదని నాగార్జున ఏదైనా మంచి పేరు చూడాలని చాలా పేర్లు  ఒక బుక్ లో రాసుకున్నారట. ఇదే తరుణంలో  ఒక సాంగ్ పడడం కోసం అనుష్క అనే అమ్మాయి స్టూడియోకి వచ్చిందట.  అయితే ఆమె పేరు నాగార్జునకు బాగా నచ్చడంతో స్వీటీ పేరును మార్చేసి హీరోయిన్ కు అనుష్క అని నామకరణం చేశారట.

అయితే ఇది బాగుందా అని అనుష్కాని  అడిగితే రెండు రోజుల వరకు మీరు అనుష్క అంటూ పిలవండి దానికి నేను రెస్పాండ్ అయి  మీ వైపు ఎక్కువగా చూస్తే ఫిక్స్ చేయమని చెప్పిందట. రెండు రోజులపాటు అనుష్క పేరును వారు రిహర్సల్ చేశారట. దీంతో అనుష్క అని పిలవగానే రెండు రోజులు ఆమె వారి వైపు చూడడం మొదలు పెట్టిందట. చివరికి ఆ పేరు అనుష్కకు కూడా నచ్చడంతో అదే పేరు ఫిక్స్ చేశారట నాగార్జున. ఇక అప్పటినుంచి ఇండస్ట్రీలో ఆమె పేరు అనుష్కగా మారిపోయింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna tollywood anushka-setty super-movie

Related Articles