CANCER: బ్రెస్ట్ క్యాన్సర్ ను టెస్ట్ ల కంటే ముందే కనిపెట్టేసే నర్సులు !

ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ను స్టార్టింగ్ లోనే ప్రాథమిక దశలోనే గుర్తిస్తూ వేల మరణాలను ఆపుతున్నారు. ప్రాణాంతక వ్యాధిని పసిగట్టడంలో అంధ మహిళలు ప్రధానపాత్ర పోషిస్తున్నారు.


Published Sep 20, 2024 04:22:00 PM
postImages/2024-09-20/1726829598_Screenshot20240920162045.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: క్యాన్సర్లు ఎందుకు అంత ప్రమాదకరం..అనుకున్న టైంలో తెలుసుకోలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరుగుతుంది. అందుకే బ్రెస్ట్ క్యాన్సర్ ను స్టార్టింగ్ లో తెలుసుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. అది కూడా కళ్లు లేని బ్లైండ్ నర్సులతో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ను స్టార్టింగ్ లోనే ప్రాథమిక దశలోనే గుర్తిస్తూ వేల మరణాలను ఆపుతున్నారు. ప్రాణాంతక వ్యాధిని పసిగట్టడంలో అంధ మహిళలు ప్రధానపాత్ర పోషిస్తున్నారు.


జర్మనీకి చెందిన గైనకాలజిస్ట్‌ డాక్టర్‌.ఫ్రాంక్‌ హాఫ్‌మన్‌ చెప్పేమాట. ఆయన ఆలోచనల్లోంచి పురుడుపోసుకున్నదే.. ‘డిస్కవరింగ్‌ హ్యాండ్స్‌’. ఎలాంటి లాభాపేక్ష లేని ఈ సంస్థ.. జర్మనీతోపాటు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న రొమ్ము క్యాన్సర్‌ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించడంలో సాయపడుతున్నది. అయితే ఈ డాక్టర్లు సహాయక సిబ్బందిగా అంధ మహిళలకు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తుంది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే దృష్టిలోపం ఉన్నవారిలో " స్పర్మజ్ఞానం’ ఎక్కువ.వారికి ఎక్కువ శాతం బ్రెయిలీ అలవాటు. కాబట్టి బ్రెయిలీ లో  ఎక్కువ వాళ్లు చదువుకుంటారు కాబట్టి జస్ట్ వారికి తాకగానే సమస్య ఏంటనేది అర్ధమవుతుంది.


ఈ అనుభవాన్ని వారు రొమ్ముక్యాన్సర్ ఉన్నవారిలో ఎక్కడ కణుతులున్నాయనేది టెస్టుల కంటే ముందే తెలుసుకోగలుగుతున్నారంటున్నారు.ప్రారంభ దశలలో ఉన్న సూక్ష్మ కణతులను కూడా వీరు స్పష్టంగా గుర్తిస్తున్నారు. వైద్యులు 1 నుంచి 2 సెం.మీ. గడ్డలను కనుగొంటే.. దృష్టిలోపం ఉన్న మహిళలు 0.5 సెం.మీ. కణతులనూ గుర్తిస్తున్నారు. డిస్కవరింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడారు కూడా. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu brest-cancer

Related Articles