కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అంటే తెలియని వారు ఉండరు. అలాంటి కుమారస్వామిని కన్నడ చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఫేమస్ నటి రాధిక ప్రేమించి పెద్దలను ఎదిరించి మరి వివాహం చేసుకుంది. దీంతో
న్యూస్ లైన్ డెస్క్: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అంటే తెలియని వారు ఉండరు. అలాంటి కుమారస్వామిని కన్నడ చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఫేమస్ నటి రాధిక ప్రేమించి పెద్దలను ఎదిరించి మరి వివాహం చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఈమె పేరు మెయిన్, సోషల్ మీడియాలో హైలెట్ అయిపోయింది. 2006లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామిని పెళ్లి చేసుకోవాలని భావించి ఈ విషయాన్ని అందరికీ చెప్పి షాక్ ఇచ్చింది.
ఒక్కసారిగా ఈ విషయాన్ని బయట పెట్టడంతో ఓవైపు చిత్ర పరిశ్రమ మరోవైపు రాజకీయ వర్గాల వరకు విపరీతమైనటువంటి చర్చలు నడిచాయి. అయితే ఈ నటి కుమారస్వామి కంటే దాదాపుగా 27 సంవత్సరాలు చిన్నది. అయితే వీరిద్దరికి ఇది రెండవ వివాహం. అయితే కుమారస్వామి మొదటి పెళ్లి 1986లో అనిత అనే అమ్మాయితో జరిగింది. ఇక రాధికాకు మొదటి పెళ్లి 2000 సంవత్సరంలో జరిగింది.
ఈ విధంగా ఇద్దరు మొదటి వివాహానికి స్వస్తి పలికి రెండో వివాహానికి నాంది పలికారు.. ఇందులో రాధిక తన ఇంట్లో కుటుంబీకులు అందరిని ఎదిరించి మరీ రెండో పెళ్లి చేసుకుంది. ఈ టైంలో రాధిక నిర్ణయం కర్ణాటకలో పెద్ద సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో చాలా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కుమారస్వామితో పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరమైపోయింది.
ప్రస్తుతం రాధిక సినీ నిర్మాతగా మారి పలు చిత్రాలకు ప్రొడ్యూసింగ్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకోవడంతో కోట్ల రూపాయలకు ఆస్తిపరురాలయింది. మొత్తం వీరి ఆస్తుల విలువ 124 కోట్లు. ఆమె భర్త ఆస్తి విలువ 44 వేల కోట్లు.