"క్లింకార" కేర్ టేకర్ జీతం..ఎన్ని లక్షలో తెలుసా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. ఈ ఫ్యామిలీ ఇంతటి స్థాయికి చేరడానికి ప్రధాన కారకుడు మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు. చిరంజీవి ఆధారంగానే ఇప్పటికే ఎంతో మంది హీరోలు 


Published Aug 11, 2024 07:04:13 PM
postImages/2024-08-11/1723383253_klinkaaracaretaker.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. ఈ ఫ్యామిలీ ఇంతటి స్థాయికి చేరడానికి ప్రధాన కారకుడు మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు. చిరంజీవి ఆధారంగానే ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగారు. అలా మెగా ఫ్యామిలీలో  చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చారు. ఈయన కేవలం టాలీవుడ్ హీరోగానే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో పేరు తెచ్చుకున్నారు.

అలా సినిమా కెరియర్ పరంగా ఎంతో దూసుకుపోతున్నటువంటి రామ్ చరణ్, ఉపాసనని పెళ్లి చేసుకొని  మరింత అదృష్టవంతుడయ్యాడు. వీరిద్దరు చిన్నప్పటినుంచే క్లాస్మేట్స్. కాలేజీ టైంలో లవ్ లో పడి కొన్నాళ్లపాటు సీక్రెట్ గా మెయింటైన్ చేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అలా కొన్నాళ్లపాటు పిల్లల్ని కనకుండా కెరియర్ పై దృష్టి పెట్టి అన్ని సెట్ అయ్యాక, ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ అమ్మాయి పేరే క్లింకరా. మెగా ఫ్యామిలీలో  క్లింకారా పుట్టిన తర్వాత అన్ని కలిసి వస్తున్నాయని అంటుంటారు.

 ముఖ్యంగా  క్లింకారా  ఇంట్లోకి వచ్చిన తర్వాత  రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఎంతో బిజీగా ఉండే రామ్ చరణ్ ఫ్యామిలీ క్లింకారా కోసం కూడా టైం కేటాయిస్తుందట. అంతే కాదు క్లింకారాకు ఒక కేర్ టేకర్  కూడా ఉందని తెలుస్తోంది. మరి ఆమె ఎవరు ఆమె జీతం ఎంత అనే విషయాలు తెలుసుకుందాం. క్లింకారాకు కేర్ టెకర్ గా చేసే ఆమె పేరు  లలిత.

చిన్నపిల్లల నర్సుగా కెరియర్ ప్రారంభించిన ఈమె అనంత్ అంబానికి  కేర్ టేకర్ గా చేసిందట. అలా ఎంతో పేరు తెచ్చుకున్న ఈమె బాలీవుడ్ లోని పలు స్టార్ హీరోల పిల్లలకు కేర్ టేకర్ గా ఉందట. ఆ తర్వాత  రామ్ చరణ్ ఉపాసన ముద్దుల కూతురు క్లింకారాకు కేర్ టేకర్ గా చేస్తోందట. ప్రస్తుతం ఈమెకు  రెండు లక్షలకు పైగానే శాలరీ ఇస్తారని తెలుస్తోంది. ఈ విధంగా కేర్ టేకర్ గా జీవితం ప్రారంభించి ఆమె  బాగానే సెట్ అయినట్టు తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu ram-charan upasana klinkaara care-taker lalitha

Related Articles